Pakistan Cricket Board changed the dates and venue for the upcoming T20I tri series
PCB : శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య జరగనున్న ట్రై సిరీస్ వేదిక మారింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వెల్లడించింది. వేదికను ఇస్లామాబాద్ నుంచి రావల్సిండికి మార్చినట్లు తెలిపింది. వాస్తవానికి ఈ ట్రై సిరీస్ నవంబర్ 17 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక రోజు ఆలస్యంగా అంటే నవంబర్ 18 నుంచి మొదలు అవ్వనుందని పేర్కొంది.
ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి కారణంగా వేదిక మార్పు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సిరీస్ కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను పీసీబీ విడుదల చేసింది.
Rishabh Pant : దేవుడు దయగలవాడు.. రిషబ్ పంత్ కామెంట్స్ వైరల్..
ట్రై సిరీస్ సవరించిన షెడ్యూల్ ఇదే..
* నవంబర్ 18న – పాకిస్థాన్ వర్సెస్ జింబాబ్వే
* నవంబర్ 20న – శ్రీలంక వర్సెస్ జింబాబ్వే
* నవంబర్ 22న – పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక
* నవంబర్ 23న – పాకిస్థాన్ వర్సెస్ జింబాబ్వే
* నవంబర్ 25న – శ్రీలంక వర్సెస్ జింబాబ్వే
* నవంబర్ 27న – పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక
* నవంబర్ 29న – ఫైనల్