PCB : పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేస్తున్న సొంత అభిమానులు.. చేసిన ప‌ని అలాంటిది మ‌రీ..!

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సోష‌ల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌కు గురైంది. పీసీబీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనే అందుకు కార‌ణం.

Imran Khan

Trolling on PCB : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సోష‌ల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌కు గురైంది. పీసీబీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనే అందుకు కార‌ణం. పాకిస్తాన్ జ‌ట్టు 1992లో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) నాయ‌క‌త్వంలో వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ను గెలిచింది. ఆ త‌రువాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పాక్ జ‌ట్టు మ‌రోసారి ట్రోఫీని ముద్దాడ‌లేదు. ఎన్నిసార్లు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ అంద‌ని ద్రాక్ష‌గానే ఊరిస్తోంది.

పాకిస్తాన్ దేశ‌ స్వాతంత్య్ర దినోత్స‌వం ఆగ‌స్టు 14న అన్న సంగ‌తి తెలిసిందే. త‌మ దేశ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా త‌మ దేశ క్రికెట్ గ‌తిని మార్చిన కొంద‌రు దిగ్గ‌జ ఆట‌గాళ్ల గురించి వివ‌రిస్తూ ఓ వీడియోను పాక్ క్రికెట్ బోర్డు రూపొందించింది. అయితే.. ఆ వీడియోలో ఎక్క‌డా ఇమ్రాన్ ఖాన్ గురించి ప్ర‌స్తావించ‌లేదు. దీంతో బోర్డు తీరుపై అభిమానులు మండిప‌డుతున్నారు. బోర్డు మాజీ ఛైర్మన్ ఖలీద్ మహమూద్ సైతం దేశంలో ఆటకు ఇమ్రాన్ ఖాన్ చేసిన సహకారాన్ని విస్మరించినందుకు వెంట‌నే పీసీబీ స‌ద‌రు వీడియోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Rishabh Pant : ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. పంత్ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌..?

ప్ర‌స్తుతం పాక్ దిగ్గ‌జ ఆట‌గాడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ‘తోషీఖానా’ కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను వీడియోలో చూపించ‌కుండా చేయ‌డం వెనుక ప్ర‌భుత్వ పెద్దల హ‌స్తం ఉంద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రాజ‌కీయాలు వేరు, క్రికెట్ వేర‌ని, రెండింటిని ముడిపెట్టి చూడ‌డం బావ్యం కాద‌ని ఇమ్రాన్ ఖాన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

చరిత్ర అనేది కేవలం ఒక్క రోజులోనే సృష్టించలేమ‌ని, దిగ్గజాలను విస్మరించేలా ఇలాంటి వీడియోలు చేయ‌డాన్ని తాము స‌హించేది లేదంటూ  #ShameOnPCBతో ట్రోలింగ్ చేస్తున్నారు.

బోర్డు మాజీ ఛైర్మన్ ఖలీద్ మహమూద్ మాట్లాడుతూ.. పీసీబీ వెంట‌నే స‌ద‌రు వీడియోను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. ఇలాంటి వీడియోలు పెట్ట‌డం బాధాక‌రమ‌న్నారు. వెంట‌నే ఇమ్రాన్ ఖాన్‌తో కూడిన వీడియోని పోస్ట్ చేయాల‌న్నారు. క్రికెట్‌ దిగ్గజానికి ఇలాంటి అవమానం జ‌ర‌గ‌డం స‌హేతుకం కాద‌న్నారు. రాజ‌కీయంగా ఇమ్రాన్ ఖాన్‌తో విభేదాలు ఉండొచ్చు అయితే.. ఆట‌కు దానికి సంబంధం లేదు. పాక్ క్రికెట్‌కు వ‌న్నె తెచ్చిన ఆట‌గాడిని ఇలా అవ‌మానించ‌డం క‌రెక్ట్ కాద‌ని మహమూద్ అన్నారు.

ODI World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్ టికెల్ కావాలా.. ఇలా రిజిస్ట్రేష‌న్ చేసుకోండి

ట్రెండింగ్ వార్తలు