Pakistan Extravagant Celebrations Of U19 Asia Cup Triumph
U19 Asia Cup 2025 : అండర్-19 ఆసియాకప్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. ఆదివారం భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 191 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి కప్పును ముద్డాడింది. కాగా.. అండర్-19 ఆసియాకప్‌ను గెలుపొందడం పాక్‌కు ఇది రెండో సారి మాత్రమే. పదమూడేళ్ల క్రితం అంటే 2012లో పాక్ తొలిసారి అండర్-19 ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది.
ఫైనల్ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. సమీర్ మిన్హాస్ (172; 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ శతకంతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. మిగిలిన వారిలో అహ్మద్ హుస్సేన్ (56; 72 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. టీమ్ఇండియా బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ మూడు వికెట్లు తీశాడు. హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు కాన్షిక్ చౌహాన్ ఓ వికెట్ సాధించాడు.
ఆ తరువాత 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 26.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా బ్యాటర్లలో దీపేష్ దేవేంద్రన్(36), వైభవ్ సూర్యవంశీ (26), ఆరోన్ జార్జ్ (16), అభిజ్ఞాన్ కుందు (13), ఖిలాన్ పటేల్ (19) మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. పాక్ బౌలర్లలో అలీ రజా నాలుగు వికెట్లు తీయగా.. మహ్మద్ సయ్యం, అబ్దుల్ సుభాన్, హుజైఫా అహ్సాన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
THE CRAZE OF CRICKET IN PAKISTAN😍🇵🇰
Imagine what the scene would be like if the main team brought the trophy home.pic.twitter.com/7SWpww9Fxh
— junaiz (@dhillow_) December 22, 2025
ఫైనల్‌లో భారత్ పై విజయం సాధించి అండర్-19 ఆసియాకప్((U19 Asia Cup 2025 )ను గెలవడంతో పాక్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. పాక్ అండర్-19 జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఇస్లామాబాద్ విమానాశ్రయంలో యువ జట్టుకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలు అభిమానులు గుమికూడారు. ఆ తరువాత ఇస్లామాబాద్‌లో విక్టరీ పరేడ్‌ను నిర్వహించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అండర్-19 ఆసియాకప్ గెలిచినందుకే ఇంతలా చేస్తే ఇక నిజంగా సీనియర్ స్థాయిలో ఆసియాకప్, ప్రపంచకప్‌లు గెలిస్తే ఇంకెంత చేస్తారో అని అంటున్నారు.
🚨 U19 ASIA CUP VICTORY PARADE IN ISLAMABAD🤯
– The team received a warm welcome at 2 AM despite the winter ❤️pic.twitter.com/3pEc9BsuXL
— junaiz (@dhillow_) December 22, 2025