Jemimah Rodrigues : అక్కడ నలుగురిని కాదు నలబై మందిని పెట్టుకోండి.. జెమీమా రోడ్రిగ్స్ కామెంట్స్..
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంది.
Jemimah Rodrigues comments after India Women beat Sri Lanka Women in 1st T20I
Jemimah Rodrigues : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం విశాఖపట్నం వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు సాధించింది. లంక బ్యాటర్లలో విష్మి గుణరత్నే(39) టాప్‌స్కోరర్. క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, శ్రీచరణి లు తలా ఓ వికెట్ తీశారు. ఆ తరువాత 122 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళల జట్టు 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ (69 నాటౌట్; 44 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగింది. స్మృతి మంధాన (25), హర్మన్ ప్రీత్ కౌర్ (15 నాటౌట్) రాణించారు.
Gautam Gambhir : టీ20 ప్రపంచకప్ జట్టులో గిల్‌కు నో ప్లేస్.. దీనిపై గంభీర్‌ని అడిగితే.. వీడియో..
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు దానిని వంద శాతం సద్వినియోగం చేసుకోవాలని అంది. ప్రస్తుతం తన మైండ్ సెట్ అదేనని చెప్పుకొచ్చింది. ఇక ఆఫ్ సైడ్‌లో తన లేట్ కట్ షాట్‌ను అడ్డుకోవడానికి నలుగైదురు ఫీల్డర్లను పెట్టాల్సి ఉంటుందని తెలిపింది. అయినప్పటికి కూడా తాను గ్యాప్ ను వెతికి మరీ షాట్లు కొడతానని అంది.
తన వరకు మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని తెలిపింది. ఇక పిచ్ నెమ్మదిగా ఉండదని, బంతి ఆగి వస్తుందని అంది. తాను టచ్‌లో ఉండడంతో బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నానని అంది. స్కోరు వంటి విషయాల గురించి ఆలోచించలేదని చెప్పింది. బంతికి అనుగుణంగా షాట్లను ఆడినట్లు తెలిపింది.
ఇక గతం గురించి ఆలోచించవద్దని, టీ20 ప్రపంచకప్ 2026 రాబోతుందని, దానిపై ప్రస్తుతం తమ దృష్టి ఉందని చెప్పుకొచ్చింది. లంకతో సిరీస్‌ను ప్రపంచకప్ కు సన్నాహకంగా ఉపయోగించుకుంటామని అంది.
