Gautam Gambhir : టీ20 ప్రపంచకప్ జట్టులో గిల్‌కు నో ప్లేస్.. దీనిపై గంభీర్‌ని అడిగితే.. వీడియో..
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు (Gautam Gambhir) టీ20 ప్రపంచకప్ 2026 భారత జట్టు ఎంపిక, శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోవడం వంటి ప్రశ్నలు ఎదురు అయ్యాయి.
T20 World cup 2026 Gautam Gambhir Refuses To Answer Shubman Gill Question
Gautam Gambhir : టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. 15 మంది సభ్యులు గల బృందాన్ని శనివారం సెలక్టర్లు ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగనుంది. అయితే.. ఈ జట్టులో టీమ్ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. ఈ విషయం అందరిని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో రెండేళ్ల తరువాత ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు.
కాగా.. జట్టు ఎంపిక ప్రకటన వెలువడిన కొన్ని గంటల తరువాత టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించాడు. జట్టు ఎంపిక, శుభ్ మన్ గిల్‌కు చోటు దక్కకపోవడం వంటి ప్రశ్నలను మీడియా సిబ్బంది గంభీర్‌ను అడిగారు. అయితే.. గంభీర్ మాత్రం వాటిపై స్పందించలేదు. అతడు నడుచుకుంటూ కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అగార్కర్ ఏమన్నాడంటే..?
గత కొంతకాలంగా శుభ్‌మన్ గిల్ టీ20 ఫార్మాట్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు.
#WATCH | Indian Men’s Cricket Team Head Coach Gautam Gambhir arrives in Delhi
BCCI today announced India’s squad for the ICC Men’s T20 World Cup 2026. pic.twitter.com/RbqVtaixyR
— ANI (@ANI) December 20, 2025
ఇక గిల్‌ను ఎంపిక చేయకపోవడం పై ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించారు. గిల్ నాణ్యమైన ఆటగాడు అన్న విషయం అందరికి తెలిసిందేనని అన్నాడు. అయితే.. ప్రస్తుతం అతడు పరుగులు చేయడంలో ఇబ్బందులు పడుతున్నాడని చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తూ గిల్ గత ప్రపంచకప్‌లోనూ ఆడలేకపోయాడని తెలిపాడు. ఆ సమయంలో భిన్నమైన కూర్పుతో వెళ్లామని, ఇప్పుడు కూడా కూర్పు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పాడు.
ఇక టాప్ ఆర్డర్‌లో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండాలని తాము భావించామన్నాడు. జట్టులో 15 మందికే చోటు ఉంటుందన్నాడు. ఈ క్రమంలోనే గిల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందన్నాడు.
Team India : ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు.. టీ20 ప్రపంచకప్ 2026 భారత జట్టులో..
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 ప్రపంచకప్ జరగనుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి.
