Abdullah Shafique and Fakhar Zaman
Pakistan vs Bangladesh : పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కెప్టెన్ బాబర్ ఆజాం రికార్డును సమం చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. కాగా.. ప్రపంచకప్‌లో అతడికి ఇది నాలుగో హాఫ్ సెంచరీ.
పాకిస్థాన్ తరుపున అరంగ్రేట ప్రపంచకప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఆజాం, మిస్బా ఉల్ హక్‌తో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మియాందాద్ 5 అర్ధశతకాలతో మొదటి స్థానంలో ఉన్నాడు.
పాక్ తరుపున అరంగ్రేట వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు..
జావేద్ మియాందాద్ – 5 అర్ధశతకాలు 1992 ప్రపంచకప్‌లో
మిస్బా ఉల్ హక్ – 4 అర్ధశతకాలు 2015 ప్రపంచకప్‌లో
బాబర్ ఆజం – 4 అర్ధశతకాలు 2019 ప్రపంచకప్‌లో
అబ్దుల్లా షఫీక్ – 4* అర్ధశతకాలు 2023 ప్రపంచకప్‌లో
ఫఖర్ జమాన్ అరుదైన ఘనత..
పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్‌లలో ఓ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఫఖర్ జమాన్ చోటు సంపాదించాడు. ఇమ్రాన్ నజీర్ 8 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉండగా 7 సిక్స్‌లతో ఫఖర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ 74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు.
ప్రపంచకప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన పాకిస్థాన్ ఆటగాళ్లు..
ఇమ్రాన్ నజీర్ – 8 సిక్సర్లు జింబాబ్వే పై 2007 కింగ్‌స్టన్‌లో
ఫఖర్ జమాన్ – 7 సిక్సర్లు బంగ్లాదేశ్ పై 2023 కోల్‌కతాలో (నేటీ మ్యాచ్)
ఇఫ్తికార్ అహ్మద్ – 4 సిక్సర్లు అఫ్గానిస్థాన్ పై 2023 చెన్నైలో
2005 తరువాత తొలి బ్యాటర్..
పఖర్ జమన్ మరో అరుదైన ఘనత సాధించాడు. 2005 తరువాత వన్డేల్లో తొలి 12 ఓవర్లలో మూడు సిక్సర్లు బాదిన మొదటి పాకిస్థాన్ ఆటగాడిగా నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయాని వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మహ్మదుల్లా(56) హాఫ్ సెంచరీ చేయగా లిట్టన్ దాస్ (45) షకీబ్ అల్ హసన్ (43), మెహిదీ హసన్ మిరాజ్(25) లు రాణించారు. అనంతరం లక్ష్యాన్ని పాకిస్థాన్ 32.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్థాన్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (81), అబ్దుల్లా షఫీక్ (68) అర్థశతకాలతో రాణించారు.