Junaid Zafar Khan : మ్యాచ్ ఆడుతూ ఆస్ట్రేలియాలో మ‌ర‌ణించిన పాక్ సంత‌తికి చెందిన క్రికెట‌ర్‌.. ఎండ దెబ్బతో..!

పాకిస్తాన్ సంతతికి చెందిన క్రికెటర్ జునైద్ జాఫర్ ఖాన్ మ్యాచ్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.

క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. అడిలైడ్‌లోని కాన్కార్డియా కాలేజీలో స్థానిక క్లబ్ మ్యాచ్ జరుగుతుండగా పాకిస్తాన్ సంతతికి చెందిన క్రికెటర్ జునైద్ జాఫర్ ఖాన్ మ్యాచ్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.

మార్చి 15న ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ ఓల్డ్‌, ఓల్డ్ కాంకోర్డియన్స్ క్రికెట్ క్లబ్‌ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఓల్డ్ కాంకోర్డియన్స్ క్రికెట్ క్లబ్‌కు జునైద్ ఖాన్ ప్రాతినిథ్యం వ‌హించాడు. ఈ మ్యాచ్లో తీవ్ర‌మైన ఎండ‌లో 40 ఓవ‌ర్లు పాటు ఫీల్డింగ్ చేసిన జునైద్ ఆ త‌రువాత బ్యాటింగ్ చేస్తూ ఏడు ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద కుప్ప‌కూలిపోయాడు.

MS Dhoni : ‘యానిమ‌ల్‌’గా మారిన ధోని.. సందీప్ రెడ్డి వంగాతో క‌లిసి.. వీడియో వైర‌ల్‌..

స్థానిక కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో జునైద్ కుప్ప‌కూలిపోయిన‌ట్లు news.com.au నివేదించింది. అత‌డిని కాపాడేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ‌లేద‌ని తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబం, స్నేహితులు, సహచరులకు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు ఓల్డ్ కాంకోర్డియన్స్ క్రికెట్ క్లబ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

‘ఓల్డ్ కాంకోర్డియన్స్ క్రికెట్ క్లబ్ చెందిన ఆట‌గాడి మ‌ర‌ణం ఎంతో బాధ‌ను క‌లిగించింది. మ్యాచ్ ఆడుతున్న‌ప్పుడు అత‌డు అస్వ‌స్థ‌త‌కు గురి అయ్యాడు. పారా మెడిక్స్ ఎంత ప్ర‌య‌త్నించినా.. అత‌డిని బ్ర‌తికించ‌లేక‌పోయారు. ఈ క్లిష్ట స‌మ‌యంలో అత‌డి కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాం.’ అని ఓల్డ్ కాంకోర్డియన్స్ క్రికెట్ క్లబ్ తెలిపింది.

NZ vs PAK : షాహీన్ అఫ్రిది బౌలింగ్‌ను చిత‌క్కొట్టిన కివీస్ ఓపెన‌ర్‌.. ఒకే ఓవ‌ర్‌లో నాలుగు సిక్స‌ర్లు.. పాక్‌ను వెంటాడుతున్న దుర‌దృష్టం..

దక్షిణ ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా తీవ్రమైన ఎండ‌లు ఉన్నాయి. వాతావరణ శాఖ ప్ర‌కారం అక్క‌డ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నాయి.

అడిలైడ్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే ఆటలు రద్దు చేయబడతాయి.

జునైద్ జాఫర్ ఖాన్ ఐటీ పరిశ్రమలో పనిచేయడానికి 2013లో పాకిస్తాన్ నుండి అడిలైడ్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది.