Pakistan Cricket team: భారత్ వేదికగా ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ 2023 జరగనుంది. ఈ మెగాటోర్నీ అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు జరుగుతుంది. ఈ మెగాటోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ జట్టు భారత్ చేరుకుంది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన క్రికెట్ బృందం దుబాయ్ నుంచి నేరుగా బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పాక్ ప్లేయర్స్‌కు ఘన స్వాగతం లభించింది. వీరికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్ వరకు పటిష్ఠ భద్రత నడుమ నగర పోలీసులు పాక్ జట్టును తరలించారు.
Pakistan Cricket team: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు
ఏడేళ్ల తరువాత పాక్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. అయితే, హైదరాబాద్ ఎయిర్ పోర్టులో లభించిన ఘన స్వాగతంతో పాక్ క్రికెట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ల్యాండ్ అయిన తరువాత కొద్దిసేపటికే పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రీది ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్పందన తెలియజేశారు. గొప్ప సాదర స్వాగతం ఇంత వరకు అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్.. ఆదరణతో పొంగిపోయానని పేర్కొన్నాడు. అదేవిధంగా ఇప్తికార్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ లు భారతీయ ఆతిథ్యాన్ని ప్రశిస్తూ ట్వీట్లు చేశారు. మహ్మద్ రిజ్వానా ట్విటర్ వేదికగా స్పందించారు. ఇక్కడి ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. అంతా చాలా స్మూత్ గా ఉంది. తదుపరి 1.5 నెలల కోసం ఎదురు చూస్తున్నాము అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
సెప్టెంబరు 29న పాక్ – న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరగనుంది. ఈ వార్మప్ మ్యాచ్ మైదానంలో ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఈ మెగాటోర్నీలో భాగంగా పాకిస్థాన్ తన మొదటి మ్యాచ్‌ను శుక్రవారం (అక్టోబర్ 6) ఉప్పల్ స్టేడియంలో నెదర్లాండ్స్ తో ఆడనుంది. అక్టోబంర్ 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
Team Pakistan ?? receiving a wonderful welcome in Hyderabad, India. Lovely to see I am the Part of This Team ❤️#Hyderabad #BabarAzam? #WorldCup2023 pic.twitter.com/Z8p39Act3v
— Hassan Ali (@RealHa55anAli) September 27, 2023
Amazing reception from the people here. Everything was super smooth. Looking forward to the next 1.5 months ?
— Muhammad Rizwan (@iMRizwanPak) September 27, 2023