పాకిస్థాన్ కోచ్‌లతో షాహీన్ షా అఫ్రిది దురుసు ప్రవర్తన!

షాహీన్ షా అఫ్రిది తమ కోచ్‌లతో ప్రవర్తించిన తీరు వెలుగులోకి రావడం, సెలక్షన్ కమిటీ నుంచి వహాబ్‌ను తొలగించడం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.  

Shaheen Afridi

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌-2024 వేళ పాకిస్థాన్ కోచ్‌లతో ఆ దేశ ఆటగాడు షాహీన్ షా అఫ్రిది (24) దురుసుగా ప్రవర్తించాడని అక్కడి మీడియా తెలిపింది. పాక్ క్రికెట్ జట్టు కోచ్‌లతోనేగాక మేనేజ్‌మెంట్ సిబ్బందితో కూడా అఫ్రిది ఇదే విధంగా ప్రవర్తించాడని చెప్పింది.

అయినప్పటికీ అఫ్రిదిపై మేనేజ్‌మెంట్ స్టాఫ్ ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విషయంపై విచారణ జరుగుతోందని పేర్కొంది. పాక్ కోచ్‌లతో అఫ్రిది దురుసుగా ప్రవర్తించాడనే విషయం.. మాజీ క్రికెటర్ వహాబ్ రియాజ్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డుకి చెందిన జాతీయ సెలక్షన్ కమిటీ నుంచి తొలగించిన సమయంలోనే బయటకు రావడం గమనార్హం.

టీ20 ప్రపంచ కప్ సమయంలో పాక్ పురుషుల జట్టుకు వహాబ్ రియాజ్ సెలెక్టర్‌గా ఉన్నాడు. పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్‌-2024లో ఏ మాత్రం రాణించలేదు. అవమానకరరీతిలో సొంత దేశానికి వెళ్లింది. దీంతో సెలక్షన్ కమిటీ నుంచి వహాబ్ ను తొలగించారు.  సెలక్షన్ కమిటీ నుంచి వహాబ్ ను తొలగించిన తర్వాత అతడు ఎక్స్ లో పలు విషయాలు తెలిపాడు.

చెప్పాలని అనుకుంటే తాను చెప్పాల్సింది చాలా ఉందని.. కానీ, తాను నిందలు వేసే వారిలో ఒకరిగా మారాలనుకోవట్లేదని అన్నాడు. కాగా, పాక్ జట్టు అసలే కష్టాల్లో ఉంది. ఇప్పుడు షాహీన్ షా అఫ్రిది తమ కోచ్‌లతో ప్రవర్తించిన తీరు వెలుగులోకి రావడం, సెలక్షన్ కమిటీ నుంచి వహాబ్‌ను తొలగించడం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Also Read : గిల్‌, రుతురాజ్ మెరుపులు.. సుంద‌ర్ తీన్‌మార్‌.. జింబాబ్వే పై భార‌త్ విజ‌యం..

 

ట్రెండింగ్ వార్తలు