×
Ad

Saim Ayub : సైమ్ అయూబ్.. పాకిస్తాన్ ‘డ‌క్’ స్టార్‌.. ఫైన‌ల్‌లో భార‌త్‌తో కూడా ఇలాగే ఆడితే..

ఆసియాక‌ప్ 2025లో పాకిస్తాన్ స్టార్ ఆట‌గాడు సైమ్ అయూబ్ (Saim Ayub) ఘోరంగా విఫ‌లం అవుతున్నాడు.

Pakistan Star batter Saim Ayub 4 ducks in 6 matchs in Asia Cup 2025

Saim Ayub : ఆసియాక‌ప్ 2025లో త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజ‌యం సాధించింది. గురువారం బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పాక్ 11 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది.

పాకిస్తాన్ స్టార్ ఆట‌గాడు సైమ్ అయూబ్ (Saim Ayub) బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొన్న అయూబ్.. హసన్ బౌలింగ్‌లో రిషద్ హుస్సేన్ క్యాచ్ అందుకోవ‌డంతో ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో ఆసియాక‌ప్ 2025లో ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ మెగాటోర్నీలో అత‌డు డ‌కౌట్ కావ‌డం ఇది నాలుగో సారి. బంగ్లాదేశ్‌తో క‌లిపి ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆయూబ్ నాలుగు మ్యాచ్‌ల్లో ప‌రుగుల ఖాతానే తెర‌వ‌లేదు.

Jaker Ali : అందుకే పాక్ చేతిలో ఓడిపోయాం.. లేదంటేనా.. బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ కామెంట్స్‌..

ఈ మెగాటోర్నీ ఆరంభంలో వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లోనూ అయూబ్ డ‌కౌట్లు అయ్యాడు. ఆ త‌రువాత సూప‌ర్‌-4లో భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ప‌రుగుల ఖాతా తెరిచాడు. 21 ప‌రుగులు చేశాడు. ఆ త‌రువాత శ్రీలంక పై 2 ప‌రుగులు చేయ‌గా తాజాగా బంగ్లాతో మ‌ళ్లీ విఫ‌లం అయ్యాడు.

పాక్ త‌రుపున టీ20ల్లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాళ్లు జాబితాలో..

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో పాక్ త‌రుపున అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాళ్ల జాబితాలో ఆయూబ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అయూబ్ 45 ఇన్నింగ్స్‌లు ఆడ‌గా ఇందులో 9 సార్లు అత‌డు ప‌రుగుల‌కే చేయ‌లేదు. ఆ జాబితాలో ఉమ‌ర్ అక్మ‌ల్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 79 ఇన్నింగ్స్‌ల్లో 10 సార్లు డ‌కౌట్లు అయ్యాడు. షాహిద్ అఫ్రిది ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అత‌డు 90 ఇన్నింగ్స్‌ల్లో 8 సార్లు ప‌రుగులు చేయ‌లేదు.

పాక్ త‌రుపున టీ20ల్లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాళ్లు వీరే..

* ఉమ‌ర్ అక్మ‌ల్ – 79 ఇన్నింగ్స్‌ల్లో 10 సార్లు
* సైమ్ అయూబ్ – 45 ఇన్నింగ్స్‌ల్లో 9 సార్లు
* షాహిద్ అఫ్రిది – 90 ఇన్నింగ్స్‌ల్లో 8 సార్లు
* క‌మ్రాన్ అక్మ‌ల్ – 53 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు
* మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ – 108 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు
* బాబ‌ర్ ఆజామ్ – 121 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు

Vaibhav Suryavanshi : చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. యూత్ వ‌న్డేల్లో సిక్స‌ర్ల కింగ్‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 135 ప‌రుగులు చేసింది. పాక్ బ్యాట‌ర్ల‌లో మహ్మద్ హారిస్ (31), మహ్మద్ నవాజ్ (25), స‌ల్మాన్ అలీ అఘా (19), షాహీన్ అఫ్రిది (19)లు రాణించారు. బంగ్లా బౌల‌ర్ల‌లో తస్కిన్ అహ్మద్ మూడు, మెహేదీ హసన్, రిషద్ హుస్సేన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ రెహ్మ‌న్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఆ త‌రువాత ల‌క్ష్య ఛేద‌న‌లో బంగ్లా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో షమీమ్ హుస్సేన్ (30) రాణించ‌గా..మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. పాక్ బౌల‌ర్ల‌లో ష‌హీన్ అఫ్రిది, హ‌రీస్‌లు చెరో మూడు, సైమ్ అయూబ్ రెండు వికెట్లు తీశాడు. మ‌హ్మ‌ద్ న‌వాజ్ ఓ వికెట్ సాధించాడు.