×
Ad

SL vs ZIM : శ్రీలంక‌కు భారీ షాక్‌.. ప‌సికూన జింబాబ్వే చేతిలో ఘోర ప‌రాజ‌యం.. ఏకంగా 67 ప‌రుగుల తేడాతో..

ముక్కోణ‌పు టీ20 సిరీస్‌లో శ్రీలంక జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. జింబాబ్వే చేతిలో ఘోర ప‌రాజ‌యాన్ని (SL vs ZIM) చ‌విచూసింది.

Pakistan T20I Tri Series 2025 Zimbabwe won by 67 runs against Srilanka

SL vs ZIM : ముక్కోణ‌పు టీ20 సిరీస్‌లో శ్రీలంక జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. రావ‌ల్పిండి వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. 67 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో (SL vs ZIM ) జింబాబ్వే జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు సాధించింది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో బ్రియాన్ బెన్నెట్ (49; 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), సికింద‌ర్ ర‌జా (47; 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు రాణించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో వ‌నిందు హ‌స‌రంగా మూడు వికెట్లు తీశాడు. ఎషాన్ మలింగ రెండు వికెట్లు సాధించాడు. చ‌మీర‌, తీక్ష‌ణ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

World boxing cup 2025 : తెలంగాణ బాక్సర్ నిఖత్ జ‌రీన్ ఖాతాలో మరో స్వర్ణం

ఆ త‌రువాత 163 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 95 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. లంక బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ ధ‌సున్ ష‌న‌క (34; 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), భానుక రాజపక్స (11) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు.

మిగిలిన అంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో బ్రాడ్ ఎవాన్స్ మూడు వికెట్లు తీశాడు. రిచర్డ్ నగరవ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. టినోటెండా మపోసా, గ్రేమ్ క్రీమెర్, ర్యాన్ బర్ల్, సికింద‌ర్ ర‌జాలు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Mohammed Shami : భార‌త జ‌ట్టులోకి నో ఛాన్స్‌.. ష‌మీ కీల‌క నిర్ణ‌యం..!

కాగా.. ఈ ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఓడిపోయింది. ఆ ఓట‌మి నుంచి తొంద‌ర‌గానే కోలుకుని స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న‌తో లంక పై విజ‌యం సాధించింది.