Pakistan U 19 Team Gets huge Cash Reward From Prime Minister Shehbaz
U19 Asia Cup 2025 : అండర్-19 ఆసియాకప్ 2025 విజేతగా పాకిస్తాన్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పై విజయం సాధించి కప్పును ముద్దాడింది. ఈ క్రమంలో పాకిస్తాన్ యువ జట్టు పై ఆ దేశ ప్రధాని కనక వర్షం కురిపించాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సమీర్ మిన్హాస్ (172; 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ శతకంతో చెలరేగాడు. అహ్మద్ హుస్సేన్ (56) రాణించాడు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ మూడు, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Krishnappa Gowtham : క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమ్ ఇండియా క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్
అనంతరం 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 26.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో దీపేష్ దేవేంద్రన్(36), వైభవ్ సూర్యవంశీ (26)లు పర్వాలేదనిపించారు. మిగిలిన వారంతా ఘోరంగా విఫలం కావడంతో 191 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. పాక్ బౌలర్లలో అలీ రజా నాలుగు వికెట్లు తీశాడు.
10 మిలియన్లు..
తమ యువ జట్టు ఆటతీరు పై పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి 10 మిలియన్లు(పాక్ కరెన్సీలో) నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంటే భారత కరెన్సీలో ఒక్కొ ఆటగాడికి సుమారు రూ.32లక్షల రూపాయలు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అండర్ 19 టీమ్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ తెలియజేశాడు.
క్రీడలో గొప్ప భవిష్యత్తు ఉన్న ప్రతిభావంతులైన ఆటగాళ్లతో పనిచేయడం తనకు చాలా ఆనందంగా ఉందని సర్ఫరాజ్ అన్నారు. జట్టును ఎంపిక చేయడం, ప్రతి ఆటగాడికి 50 ఓవర్ల క్రికెట్ గురించి తగినంత అనుభవం కల్పించడం అనే సుదీర్ఘ ప్రక్రియ విజయానికి కారణమని చెప్పాడు.