Krishnappa Gowtham : క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమ్ ఇండియా క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్
టీమ్ఇండియా క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ (Krishnappa Gowtham )ఆటకు వీడ్కోలు పలికాడు.
Krishnappa Gowtham announces retirement from cricket
Krishnappa Gowtham : టీమ్ఇండియా క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 14 సంవత్సరాల తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. లోయర్ ఆర్డర్‌లో పవర్-హిట్టింగ్, నమ్మకమైన ఆఫ్-స్పిన్‌కు పేరుగాంచిన గౌతమ్(Krishnappa Gowtham).. రంజీ ట్రోఫీ, ఐపీఎల్‌లో తన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకు ప్రాతినిధ్యం వహించాడు ఈ ఆల్‌రౌండర్.
గౌతమ్ 59 ఫస్ట్-క్లాస్, 68 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 320 కి పైగా వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో క్రమంలో కీలకమైన పరుగులను కూడా సాధించాడు. అతను 2023 వరకు కర్ణాటక క్రికెట్‌లో రెగ్యులర్ వ్యక్తిగా కొనసాగాడు. ఆ తర్వాత అతను రాష్ట్ర జట్టుకు దూరమైనప్పటికీ, దేశీయ సర్క్యూట్‌పై అతని మొత్తం ప్రభావం గణనీయంగా ఉంది.
టీమ్ఇండియా తరుపున అతడు ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. 2021లో శ్రీలంకతో ఆడిన నాటి మ్యాచ్‌లో అతడు బౌలింగ్‌లో ఒక వికెట్ తీయగా బ్యాటింగ్‌లో రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఐపీఎల్ లో 2018 లో అరంగ్రేటం చేసిన అతడు 2024 వరకు ఆడాడు. మొత్తంగా 36 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీశాడు. 247 పరుగులు సాధించాడు.
