Rohit Sharma : ఇంగ్లాండ్ పై రోహిత్ శర్మ సెటైర్లు.. ఆస్ట్రేలియాలో అంత ఈజీ కాదు.. అప్పుడు గబ్బాలో మేము..
యాషెస్ సిరీస్ కోల్పోవడంతో ఇంగ్లాండ్ పై రోహిత్ శర్మ (Rohit Sharma) సెటైర్లు వేశాడు.
Rohit Sharma trolled England following their Ashes series loss in Australia
Rohit Sharma : ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన చేస్తోంది. వరుసగా మూడు టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ క్రమంలో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే యాషెస్ సిరీస్‌ను కోల్పోయింది. కాగా.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్‌ను కోల్పోవడం వరుసగా ఇది నాలుగో సారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పై విమర్శల జడివాన కురుస్తోంది.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇంగ్లాండ్ పై సెటైర్లు వేశాడు. గురుగ్రామ్‌లో జరిగిన మాస్టర్స్ యూనియన్ స్నాతకోత్సవం కార్యక్రమంలో హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవడం అంత ఈజీ కాదన్నాడు. ఈ విషయం ఇంగ్లాండ్ ఆటగాళ్లను అడిగితే తెలుస్తుందన్నాడు.
ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తన క్రికెట్ కెరీర్‌లో అత్యంత చిరస్మరణీయ విజయాలను గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా 2021లో గబ్బా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ గెలిచిన విషయాన్ని ప్రస్తావించాడు.
Rohit Sharma said : “Playing in Australia is the most difficult you can ask England about it.” 😭😂🔥
bRO just owned England and @TheBarmyArmy 🤣😆🙏 pic.twitter.com/qvXQWMQNe3
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 21, 2025
‘2021లో ఆస్ట్రేలియాలోని గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మేము గెలిచాము. వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడు. ఆ మ్యాచ్‌లో మేం గెలుస్తామని మొదట ఎవరూ నమ్మలేదు. అలాంటి స్థితి నుంచి పుంజుకుని గెలిచాం. ఆ మ్యాచ్‌లో మా ప్రధాన ఆటగాళ్లు అందరూ గాయాలు, వివిధ కారణాలతో అందుబాటులో లేరు.’ అని రోహిత్ శర్మ అన్నాడు.
AUS vs ENG : గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్..! ఇంగ్లాండ్‌కు ఇక పండగేనా?
ఆ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ ఓ విలేకరుల సమావేశంలో కొన్ని కామెంట్స్ చేయడం తనకు ఇంకా గుర్తు ఉందన్నాడు. అందులో ఓ కామెంట్ ఎంతో ఆలోచింపజేసిందన్నాడు. ఆ మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లు అరంగ్రేటం చేశారని గుర్తు చేసుకున్నాడు.
గబ్బా అంటే ఆస్ట్రేలియా కంచుకోట అని, ఆ మ్యాచ్‌కు ముందు వరకు అక్కడ ఆసీస్‌ను ఎవరూ ఓడించలేదన్నాడు. గెలుపు పై ఆశలు లేని స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని తాము విజయం సాధించామని చెప్పుకొచ్చాడు. ఇక గబ్బాలో గెలుపొందిన తరువాత ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం తమకు ఎంతో గ్రేట్ అచీవ్‌మెంట్ అని రోహిత్ అన్నాడు.
