Shubman Gill : టీ20జ‌ట్టులో గిల్‌కు నో ప్లేస్‌.. గొప్ప సెల‌క్ష‌న్‌.. క్రిస్ శ్రీకాంత్ హాట్ కామెంట్స్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ జ‌ట్టులో శుభ్‌మ‌న్ గిల్‌కు (Shubman Gill ) స్థానం ద‌క్క‌లేదు

Shubman Gill : టీ20జ‌ట్టులో గిల్‌కు నో ప్లేస్‌.. గొప్ప సెల‌క్ష‌న్‌.. క్రిస్ శ్రీకాంత్ హాట్ కామెంట్స్‌

Kris Srikkanth says he didnt expect India to drop Shubman Gill

Updated On : December 22, 2025 / 4:32 PM IST

Shubman Gill : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ జ‌ట్టులో టీమ్ఇండియా స్టార్ ప్లేయ‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌కు స్థానం ద‌క్క‌లేదు. ఈ విష‌యం పై టీమ్ఇండియా మాజీ సెల‌క్ట‌ర్ క్రిస్ శ్రీకాంత్ స్పందించాడు. గిల్ ను ప‌క్క‌న‌ పెట్ట‌డం త‌న‌ను షాక్‌కు గురి చేసింద‌న్నాడు. సెలక్షన్ కమిటీ ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తాను ఊహించ‌లేద‌న్నాడు. ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కి ఎంపిక చేసిన జ‌ట్టు పై స్పందిస్తూ అద్భుతమైన జ‌ట్టు అని అన్నాడు.

గిల్ వ‌న్డేల్లో, టెస్టుల్లో చాలా బాగా ఆడుతున్నాడ‌ని, గ‌త కొంత కాలంగా టీ20 ఫార్మాట్‌లో అత‌డు ఇబ్బంది ప‌డుతున్న విష‌యాన్ని శ్రీకాంత్ గుర్తు చేశాడు. ఇషాన్ కిష‌న్, సంజూ శాంస‌న్ వంటి ఆట‌గాళ్ల స్ట్రైక్‌రేటుతో పోలిస్తే గిల్ స్ట్రైక్‌రేటు కూడా చాలా త‌క్కువ‌గా ఉంద‌న్నాడు. రింకూ సింగ్‌, ఇషాన్ కిష‌న్‌ల‌కు జ‌ట్టులో చోటు ఇవ్వ‌డం చాలా మంచి నిర్ణ‌యం అని అన్నాడు.

Vijay Hazare Trophy : విజ‌య్ హ‌జారే ట్రోఫీ.. ఒకే జ‌ట్టులో శుభ్‌మ‌న్ గిల్, అభిషేక్ శ‌ర్మ‌, అర్ష్‌దీప్ సింగ్‌

ఈ ఏడాది ఆసియాక‌ప్ 2025తో టీ20ల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు గిల్‌. అత‌డికి వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను సైతం అందించారు. దీంతో టెస్టులు, వ‌న్డేల్లో కెప్టెన్ అయిన గిల్ భ‌విష్య‌త్ లో టీ20 సార‌థ్య బాధ్య‌త‌ల‌ను అందుకుంటాడ‌ని అంతా భావించారు. అయితే.. గిల్ అంచ‌నాల‌ను అందుకోవ‌డం విఫ‌లం అయ్యాడు. రీఎంట్రీలో 15 టీ20 మ్యాచ్‌లు ఆడ‌గా 140 కంటే త‌క్కువ స్రైక్‌రేటుతో 291 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం భార‌త జ‌ట్టు ఇదే..

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిష‌న్