Palaash Muchhal wishes Smriti Mandhana for Womens World Cup victory
Smriti Mandhana : మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్పును ముద్దాడింది. భారత విజయంలో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సైతం తన వంతు పాత్ర పోషించింది. ఫైనల్ మ్యాచ్‌లోనూ 58 బంతులు ఎదుర్కొని 8 ఫోర్ల సాయంతో 45 పరుగులు సాధించింది. ఈ క్రమంలో టీమ్‌తో పాటు స్మృతి పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ క్రమంలోనే మ్యూజిక్ కంపోజర్, స్మృతి మంధాన ప్రియుడు పలాష్ ముచ్చల్ సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఓ ఫోటోను కూడా పంచుకున్నాడు. అందులో వరల్డ్ కప్‌ను పట్టుకుని అతడు స్మృతి మంధానకు ఇస్తున్నట్లుగా ఉంది.
ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారగా.. అతడి చేతి పై ఉన్న టాటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎస్ఎం 18 అని ఉంది. ఎస్ఎం అంటే స్మృతి మంధాన అని అర్థం. ఇక 18 అంటే.. ఆమె జెర్సీ నంబర్.
నవంబర్ 20న పెళ్లి..?
ఇక పలాష్, స్మృతి లు ఈ నెలలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా సమాచారం. 2019 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట గతేడాది తమ ఐదో వార్షికోత్సవం అంటూ తమ రిలేషన్ షిప్ గురించి అందరికి తెలియజేశారు. ఇక వీరిద్దరు నవంబర్ 20న పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.