×
Ad

Smriti Mandhana : స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహంపై సస్పెన్షన్‌కు తెరదించిన పలాశ్‌ తల్లి అమిత.. ఏం చెప్పారంటే?

Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ వివాహం ఆగిపోవడం ఇప్పుడు

Smriti Mandhana

Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ వివాహం ఆగిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద మిస్టరీగా మారింది. నవంబర్ 23న జరగాల్సిన వీరి పెళ్లి వేడుక వాయిదా పడిన విషయం తెలిసిందే. స్మృతి తండ్రి అనారోగ్యంకు గురికావడంతో పెళ్లి వాయిదా పడినట్లు ప్రకటించారు. అయితే, ఇటీవల స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించిన అన్ని పోస్టులను, ఎంగేజ్మెంట్ వీడియోలను, ప్రపోజల్ వీడియోలనుసైతం తొలగించింది. దీంతో వీరి వివాహం వాయిదాకు తెర వెనుక ఏదో పెద్ద సమస్య ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో పలాశ్ ముచ్చల్ తల్లి అమిత వారి వివాహంపై క్లారిటీ ఇచ్చారు.

Also Read: IND vs SA : కోహ్లీ అంటే ధోనీకి ఎంత ప్రేమో చూడండి.. దగ్గరుండి మరీ.. ధోనీ ఇంటికి క్రికెటర్లు.. వీడియోలు వైరల్

స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహంపై నెలకొన్న సస్పెన్షన్‌కు పలాశ్ తల్లి అమిత ముచ్చల్ తెరదించారు. ఓ ఆంగ్లపత్రికతో ఆమె మాట్లాడారు. త్వరలోనే స్మృతి మంధాన, ముచ్చల్ పెళ్లి జరుగుతుందని, స్మృతికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశామని ఆమె చెప్పారు. తొందరలోనే వారిద్దరి పెళ్లి జరుగుతుందని పేర్కొన్నారు. ‘పలాశ్‌.. స్మృతిని అర్ధాంగిగా ఇంటికి తీసుకురావాలని కలలు కన్నాడు. నేను కూడా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నా. ఇప్పుడంతా బాగానే ఉంది. వారిద్దరి వివాహం అతిత్వరలో జరుగుతుంది’ అని చెప్పారు. అయితే, వీరి వివాహానికి సంబంధించిన ప్రకటన స్మృతి మంధాన, ఆమె కుటుంబం వైపునుంచి ఇంకా రాలేదు.

స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా.. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు లక్షణాలతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో స్మృతి, పలాశ్ పెళ్లి ఆగిపోయింది. ప్రస్తుతం స్మృతి తండ్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇంటి వద్ద కోలుకుంటున్నాడు. అదే సమయంలో పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం చర్చనీయాంశం అయింది. అయితే, వరుస మ్యూజిక్ కచేరీలు, వివాహ పనుల ఒత్తిడి వల్లనే పలాశ్ ఆరోగ్యం దెబ్బతిన్నదని అతని సన్నిహితులు పేర్కొన్నారు.

స్మృతి, పలాశ్ కుటుంబాల మధ్య విబేధాలు తలెత్తడవంతో వారి వివాహం ఆగిపోయిందని వదంతులు వ్యాపించాయి. ఈ పుకార్లుపై గతంలో పలాశ్ తల్లి అమిత ముచ్చల్ స్పందించారు. స్మృతి కంటే ఆమె తండ్రితోనే పలాశ్ కు ఎక్కువ అనుబంధం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే వివాహం వాయిదా వేయడం జరిగిందని, ఆయన కోలుకోగానే వివాహం జరుగుతుందని ఆమె గతంలో చెప్పారు. ఈ పరిణామాల తరువాత స్మృతి మంధాన తన ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లిక సంబంధించిన అన్ని పోస్టులను, ఎంగేజ్మెంట్ వీడియోలను, ప్రపోజల్ వీడియోలను సైతం తొలగించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్మృతి, పలాశ్ వివాహం రద్దు వెనుక ఏదో పెద్ద కారణమే ఉందంటూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పలాశ్ తల్లి ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. త్వరలోనే స్మృతి, పలాశ్ వివాహం జరుగుతుందని పేర్కొన్నారు.