Pant recreates Sunil Gavaskar Stupid stupid stupid meltdown
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025కి సిద్ధం అవుతున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్ ను మెగావేలంలో లక్నోసూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక లక్నో జట్టు సైతం పంత్‌ను తమ కెప్టెన్‌గా ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. రిషబ్ పంత్ ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టెస్టుల్లో కీపింగ్ చేస్తూ అతడు చేసే వ్యాఖ్యలు స్టంప్ మైక్ లో రికార్డు అయి వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా.. ఇప్పుడు దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను పంత్ రీక్రియేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rishabh Pant recreating the ‘Stupid, Stupid, Stupid!’ of Sunil Gavaskar. 🤣pic.twitter.com/JhrK34luWh
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2025
అసలేం జరిగింది..
ఆస్ట్రేలియా గడ్డపై రిషబ్ పంత్‌కు మెరుగైన రికార్డు ఉంది. అయితే.. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇక మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఓ పేలవ షాట్ ఆడి పంత్ ఔట్ అయ్యాడు. అతడు ఔటైన తీరుపై విమర్శలు వచ్చాయి. కాగా.. అతడు ఔటైనప్పుడు కామెంట్రీ బాక్స్‌లో ఉన్న దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’ అంటూ పంత్ విమర్శించాడు.
ఇక తాజాగా ఓ యాడ్ షూట్‌లో పంత్ .. గవాస్కర్ వ్యాఖ్యలను పునరావృతం చేశాడు. తనదైన శైలిలో ‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’ అంటూ అందరిని నవ్వించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.