IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్లు అయిన ఆటగాళ్లు వీరే.. రోహిత్ శర్మ నుంచి పీయూష్ చావ్లా వరకు..
ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరూ కోరుకోని రికార్డును అందుకున్న ఆటగాళ్లు వీరే..

Most ducks For Indian Premier League
ఐపీఎల్ ధనాధన్ ఆటకు ప్రసిద్ధి.. ఆటగాళ్లు సిక్సర్ల, ఫోర్లతో అభిమానులను అలరిస్తూ ఉంటారు. కొందరు ఆటగాళ్లు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, సెంచరీ వంటి రికార్డులను సృష్టిస్తుంటే మరికొందరు మాత్రం ఎవ్వరూ కోరుకోని రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటారు. ఐపీఎల్ చరిత్రలో పరుగుల ఖాతా తెరవకుండానే ఇప్పటి వరకు ఎక్కువ సార్లు పెవిలియన్‌కు చేరిన ఆటగాళ్లు ఎవరో ఓ సారి చూద్దాం..
ఐపీఎల్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో టీమ్ఇండియా ఆటగాళ్లు దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మలు ఉండడం గమనార్హం. డీకే 18 సార్లు డకౌట్ కాగా.. హిట్‌మ్యాన్ రోహిత శర్మ 17 సార్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Ashwin : ‘నా వందో టెస్టుకు ధోనిని పిలిస్తే రాలేదు.. అయితే..’ అశ్విన్ కామెంట్స్ వైరల్..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లు వీరే..
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో గ్లెన్ మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ లు సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరు సంయుక్తంగా 18 సార్లు డకౌట్లు అయ్యారు. ఆ తరువాత వరుసగా రోహిత్ శర్మ, పీయూష్ చావ్లా, సునీల్ నరైన్ తదితరులు ఉన్నారు.
గ్లెన్ మాక్స్‌వెల్ – 134 మ్యాచ్‌ల్లో 18 సార్లు..
దినేశ్ కార్తీక్ – 257 మ్యాచ్‌ల్లో 18 సార్లు
రోహిత్ శర్మ – 257 మ్యాచ్‌ల్లో 17 సార్లు
పీయూష్ చావ్లా – 192 మ్యాచ్‌ల్లో 16 సార్లు
సునీల్ నరైన్ – 177 మ్యాచ్‌ల్లో 16 సార్లు
రషీద్ ఖాన్ – 121 మ్యాచ్‌ల్లో 15 సార్లు
మన్‌దీప్ సింగ్ – 111 మ్యాచ్‌ల్లో 15 సార్లు
మనీష్ పాండే – 171 మ్యాచ్‌ల్లో 14 సార్లు
అంబటి రాయుడు – 187 మ్యాచ్‌లో 14 సార్లు
హర్భజన్ సింగ్ – 163 మ్యాచ్‌ల్లో 13 సార్లు