Ashwin : ‘నా వందో టెస్టుకు ధోనిని పిలిస్తే రాలేదు.. అయితే..’ అశ్విన్ కామెంట్స్ వైర‌ల్‌..

ధోని గురించి అశ్విన్ ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నాడు.

Ashwin : ‘నా వందో టెస్టుకు ధోనిని పిలిస్తే రాలేదు.. అయితే..’ అశ్విన్ కామెంట్స్ వైర‌ల్‌..

I Invited MS Dhoni for my 100th Test But Ravichandran Ashwin comments viral

Updated On : March 17, 2025 / 4:12 PM IST

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌లో ఒక‌డైన ర‌విచంద్ర‌న్ అశ్విన్ బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ సిరీస్‌లో మూడో టెస్టు మ్యాచ్ అనంత‌రం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌న కెరీర్‌లో అశ్విన్ మొత్తం 106 టెస్టులు ఆడాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన త‌రువాత అశ్విన్ ఆడుతున్న తొలి ఐపీఎల్ సీజ‌న్ ఇదే. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి అశ్విన్ మాట్లాడిన మాటలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

అశ్విన్ త‌న కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లాండ్ పై ఆడాడు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌రిగింది. వందో టెస్టు సంద‌ర్భంగా బీసీసీఐ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసి జ్ఞాపిక‌ను బ‌హుక‌రించింది. అయితే.. ఆ జ్ఞాపిక‌ను మ‌హేంద్ర సింగ్ ధోని చేతుల మీదుగా తీసుకోవాల‌ని అశ్విన్ భావించాడ‌ట‌.

Most Sixes In IPL : ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే.. రోహిత్‌, కోహ్లీల మ‌ధ్య పోటీ?

అందుక‌నే.. ముందుగానే ధోనిని మ్యాచ్‌కు రావాల‌ని ఆహ్వానించాడ‌ట అశ్విన్‌. కానీ ధోని మాత్రం రాలేద‌ని అశ్విన్ వెల్ల‌డించాడు. ‘ధ‌ర్మ‌శాల వేదిక‌గా నా 100వ టెస్టు మ్యాచ్ ఆడా. ధోని నుంచి మెమొంటోను అందుకోవాల‌ని భావించాను. అదే నా చివ‌రి మ్యాచ్ అవుతుంద‌ని భావించాను. కానీ.. ఆ టెస్టుకు ధోని రాలేదు.’ అని అశ్విన్ చెప్పాడు.

త‌న‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవ‌డంలో ధోని విఫ‌ల‌మైన‌ప్ప‌టికి ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడ‌ని తాను ఊహించ‌లేద‌ని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు జ‌రిగిన మెగా వేలంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ అశ్విన్‌ను తీసుకుంది.

IPL 2025 : మీకు జియో సిమ్ ఉందా..? ఐపీఎల్‌ను ఫ్రీగా చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

దీని గురించి అశ్విన్ మాట్లాడుతూ.. ‘సీఎస్‌కే కు మ‌ళ్లీ తీసుకుని ఇలాంటి ఓ బ‌హుమ‌తి ఇస్తాడ‌ని ఊహించ‌లేదు. ధోనికి ధ‌న్య‌వాదాలు. నీ వ‌ల్లే ఇక్క‌డ ఉన్నా. మ‌రీ ముఖ్యంగా ఓ విష‌యం చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా క్రికెట్ ఆడా.. ఎంతో ఆస్వాదించా.. కానీ అదంతా ప‌క్క‌న పెట్టేసి ఇప్పుడు.. ఆట‌ను ఆస్వాదించాల‌ని భావిస్తున్నాను. అని అశ్విన్ తెలిపాడు.

2008లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తోనే ర‌విచంద్ర‌న్ అశ్విన్ త‌న ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2015 వ‌ర‌కు ఆ జ‌ట్టుతోనే కొన‌సాగాడు. ఆ త‌రువాత పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హంచాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2025తో మ‌ళ్లీ త‌న సొంత‌గూటికి చేరుకున్నాడు.