IPL 2025 : మీకు జియో సిమ్ ఉందా..? ఐపీఎల్‌ను ఫ్రీగా చూడొచ్చు.. ఎలాగో తెలుసా?
ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను జియోకు చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Do you know for free IPL 2025 Live Streaming for mobile and Smart TVs here is data plan details
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 18వ సీజన్ జరగనుంది. ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది.
కాగా.. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను జియోకు చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు జియో సినిమాస్‌లో ఐపీఎల్‌ను ఉచితంగా చూసే అవకాశం ఉండేది. అయితే.. ఇటీవల జియో, డిస్నీ+హాట్‌స్టార్‌లు విలీనం కావడంతో సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇది చాలా మందిని నిరాశకు గురి చేసింది.
Ishan Kishan : సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తలనొప్పిగా మారిన ఇషాన్ కిషన్? బలం అవుతాడునుకుంటే ?
అయితే.. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా జియో తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. 90 రోజుల పాటు జియో హాట్ స్టార్ సబ్‌స్ర్కిప్షన్ ను ఉచితంగా ఇస్తోంది. అయితే.. దీని కోసం ఓ పని చేయాల్సి ఉంది. కొన్ని ప్రత్యేక ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకున్న వారికి జియో హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ ను ఫ్రీగా ఇస్తున్నారు.
– రూ.299 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితం. ఇది కొత, పాత వినియోగదారులకు అందరి కోసం. దీంతో జియో హాట్‌స్టార్ ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు. మొబైల్ లేదా టీవీలో 4K క్వాలిటీలో మ్యాచ్‌లను వీక్షించొచ్చు. అంతేకాదండోయ్ అదనంగా 50 రోజుల పాటు జియో పైబర్ సర్వీసులు కూడా ఉచితంగా లభిస్తాయని జియో ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక టీవీలో అయితే స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్స్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.