Most Sixes In IPL : ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే.. రోహిత్‌, కోహ్లీల మ‌ధ్య పోటీ?

ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

Most Sixes In IPL : ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే.. రోహిత్‌, కోహ్లీల మ‌ధ్య పోటీ?

List Of Batters With Most Sixes In IPL History

Updated On : March 17, 2025 / 3:43 PM IST

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 సీజ‌న్ మ‌రో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. మే 25 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో ప్రేక్ష‌కులు ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షంలో త‌డిసి ముద్ద కానున్నారు. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు ఎవ‌రో ఓసారి చూద్దాం.

క్రిస్ గేల్..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్‌గేల్ పేరిట ఉంది. మూడే వేరు వేరు ఫ్రాంచైజీల త‌రుపున ఆడాడు. పంజాబ్, కోల్‌కతా, బెంగళూరు జట్ల తరపున 142 మ్యాచ్‌లు ఆడి 357 సిక్స‌ర్లు కొట్టాడు. ఐపీఎల్‌లో 350 సిక్స‌ర్లు కొట్టిన ఏకైక ఆట‌గాడిగానూ క్రిస్‌గేల్ కొన‌సాగుతున్నాడు.

IPL 2025 : మీకు జియో సిమ్ ఉందా..? ఐపీఎల్‌ను ఫ్రీగా చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

రోహిత్ శర్మ..
ఐపీఎల్‌లో విజ‌య‌వంతమైన కెప్టెన్ల‌లో రోహిత్ శ‌ర్మ ఒక‌డు. ముంబై ఇండియ‌న్స్‌కు ఐదు ఐపీఎల్ ట్రోఫీల‌ను అందించాడు. ఇక బ్యాటింగ్‌లో దుమ్ముదులిపే రోహిత్ శ‌ర్మ ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 257 మ్యాచ్‌ల్లో 280 సిక్స‌ర్లు బాదాడు.

విరాట్ కోహ్లీ..
ప‌రుగుల యంత్రం, రికార్డుల రిరాజు విరాట్ కోహ్లీ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 252 మ్యాచ్‌ల్లో 272 సిక్స‌ర్లు బాదాడు. రోహిత్ కంటే కేవ‌లం 8 సిక్స‌ర్ల వెనుకంజ‌లో ఉన్నాడు. ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో రోహిత్ ను కోహ్లీ అధిగ‌మిస్తాడో లేదో చూడాలి.

Ishan Kishan : స‌న్‌రైజ‌ర్స్‌ హైద‌రాబాద్‌కు త‌ల‌నొప్పిగా మారిన ఇషాన్ కిష‌న్‌? బ‌లం అవుతాడునుకుంటే ?

మహేంద్ర సింగ్ ధోని..
ఐపీఎల్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్ల‌లో మ‌హేంద్ర సింగ్ ధోని ఒక‌డు. ధోని 264 మ్యాచ్‌ల్లో 252 సిక్స‌ర్లు బాదాడు. ఈ క్ర‌మంలో అత్య‌ధిక సిక్స‌ర్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో ధోని చాలా లేటుగా బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. అయిన‌ప్ప‌టికి త‌న‌దైన మెరుపులు మెరిపించాడు. మ‌రి ఈ సీజ‌న్‌లో అయిన‌.. బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ముందుకు వ‌స్తాడా? లేదో చూడాల్సిందే.

ఏబీ డివిలియ‌ర్స్‌..
ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాళ్ల జాబితాలో ఏబీ డివిలియ‌ర్స్ 5వ స్థానంలో ఉన్నాడు. లీగ్ చ‌రిత్ర‌లో మిస్ట‌ర్ 360 డిగ్రీస్ ఆట‌గాడు 184 మ్యాచ్‌ల్లో 251 సిక్స‌ర్లు బాదాడు.

IPL 2025 : ఐపీఎల్ 2025కు ముందు స‌న్‌రైజ‌ర్స్‌ హైద‌రాబాద్‌కు శుభ‌వార్త‌..

ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన టాప్‌-10 ఆట‌గాళ్లు వీరే..

క్రిస్ గేల్ – 142 మ్యాచుల్లో 357 సిక్స‌ర్లు
రోహిత్ శ‌ర్మ – 257 మ్యాచుల్లో 280 సిక్స‌ర్లు
విరాట్ కోహ్లీ – 252 మ్యాచుల్లో 272 సిక్స‌ర్లు
ఎంఎస్ ధోని – 264 మ్యాచుల్లో 252 సిక్స‌ర్లు
ఏబీ డివిలియ‌ర్స్ – 184 మ్యాచుల్లో 251 సిక్స‌ర్లు
డేవిడ్ వార్న‌ర్ – 184 మ్యాచుల్లో 236 సిక్స‌ర్లు
కీర‌న్ పొలార్డ్ – 189 మ్యాచుల్లో 223 సిక్స‌ర్లు
ఆండ్రీ ర‌సెల్ – 127 మ్యాచుల్లో 209 సిక్స‌ర్లు
సంజూ శాంస‌న్ – 168 మ్యాచుల్లో 206 సిక్స‌ర్లు
సురేశ్ రైనా – 205 మ్యాచుల్లో 203 సిక్స‌ర్లు
షేన్ వాట్స‌న్ – 145 మ్యాచుల్లో 190 సిక్స‌ర్లు