GT vs DC : పంత్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. 89 ప‌రుగుల‌కే గుజ‌రాత్ ఆలౌట్‌

గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

Gujarat Titans vs Delhi Capitals : ఐపీఎల్ 2024లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా దాదాపు 15 నెల‌లు ఆట‌కు దూర‌మైన పంత్ రీ ఎంట్రీలో బ్యాట‌ర్‌గానే కాకుండా వికెట్ కీప‌ర్‌గా దుమ్ములేపుతున్నాడు. మునుప‌టిలా వికెట్ల వెనుక ఎంతో చురుగ్గా ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో ఓ అద్భుత‌మైన క్యాచ్‌ను అందుకున్నాడు.

గుజ‌రాత్ ఇన్నింగ్స్ 5వ ఓవ‌ర్‌ను ఇషాంత్ శ‌ర్మ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతిని గుజ‌రాత్ బ్యాట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ షాట్ ఆడాడు. అయితే.. బంతి ఎడ్జ్ తీసుకుంది. వికెట్ కీప‌ర్ అయిన పంత్ త‌న ఎడ‌మ చేతి వైపు డైవ్ చేస్తూ చ‌క్క‌టి క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Kris Srikkanth : ఆర్‌సీబీ గెల‌వాలంటే.. 11 మంది బ్యాట‌ర్ల‌తో బ‌రిలోకి.. కోహ్లి బౌలింగ్

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్17.3 ఓవ‌ర్ల‌లో 89 ప‌రుగుల‌కే ఆలౌటైంది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ (31; 24 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) ఫ‌ర్వాలేద‌నిపించాడు. ర‌షీద్‌తో పాటు సాయి సుద‌ర్శ‌న్ (12), రాహుల్ తెవాటియా (10) రెండు అంకెల స్కోరు సాధించగా మిగిలిన వారు అంద‌రూ సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌లో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీశాడు. ఇషాంత్ శ‌ర్మ‌, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అక్ష‌ర్ ప‌టేల్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్‌లు చెరో వికెట్ సాధించారు.

MS Dhoni : ధోని ఐపీఎల్ 2025 సీజ‌న్ ఆడతాడా..? ఒక్క ముక్క‌లో చెప్పేసిన సురేశ్ రైనా

ట్రెండింగ్ వార్తలు