Paris Olympics 2024 : మూడో పతకంపై గురిపెట్టిన మను బాకర్.. ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్స్ ఇవాళ్టి షెడ్యూల్ ఇదే..

పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో భారత పతకాశలు మోస్తున్న యువ షట్లర్ లక్ష్యసేన్ మరో అడుగు ముందుకేశాడు. సెమీఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు.

manu bhaker

Paris Olympics 2024 Day 8 : పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా 8వరోజు భారత్ అథ్లెట్స్ పలు విభాగాల్లో తలపడనున్నారు. ముఖ్యంగా మను బాకర్ వైపు అందరి చూపు నెలకొంది. ఒలింపిక్స్ లో భారత్ కు ఇప్పటి వరకు మూడు పతకాలు దక్కాయి. అందులో రెండు పతకాలు షూటింగ్ విభాగంలో వచ్చినవే.. అవికూడా మను బాకర్ సాధించినవే. అయితే, ఆమె మరో పతకాన్ని సాధించేందుకు సిద్ధమవుతోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ లో ఫైనల్ చేరిన ఆమె మూడో పతకంపై కన్నేసింది. ఇవాళ మధ్యాహ్నం 1గంటకు మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్ పోటీ జరగనుంది. ఈ పోటీలో మనుబాకర్ విజయం సాధిస్తే ఆమె సరికొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది.

Also Read : Paris Olympics 2024: ఆస్ట్రేలియాపై విజయ ఢంకా మోగించిన భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో భారత పతకాశలు మోస్తున్న యువ షట్లర్ లక్ష్యసేన్ మరో అడుగు ముందుకేశాడు. శుక్రవారం రాత్రి జరిగిన బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఈవెంట్‌లో లక్ష్య సేన్‌ సెమీఫైనల్‌కు బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. సమ్మర్ గేమ్స్ లో చివరి నాలుగింటిలోకి ప్రవేశించిన భారతదేశం నుంచి మొదటి పురుషుల బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా లక్ష్యసేన్ నిలిచాడు. మహిళల సికిల్స్ దిగ్గజాలు సైనా నెహ్వాల్, పీవీ సింధూ గత ఒలింపిక్స్ లో ఇదే ఫీట్ సాధించారు. ఆదివారం సెమీఫైనల్స్ లో 2021 ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్ యూ లేదా ఒలింపిక్స్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సెన్ తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.

Also Read : Paris Olympics 2024: ఆస్ట్రేలియాపై విజయ ఢంకా మోగించిన భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ షెడ్యూల్ నేడు (ఆగస్టు 03)

షూటింగ్ విభాగంలో..
మహిళల స్కీట్ క్వాలిఫికేషన్ డే 1 – రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ – మధ్యాహ్నం 12:30
పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ డే 2 – అనంత్‌జిత్ సింగ్ నరుకా – మధ్యాహ్నం 12:30
మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్ – మను భాకర్ – మధ్యాహ్నం 1:00
పురుషుల స్కీట్ ఫైనల్ (అర్హత ఆధారంగా) – 7:00 PM.

గోల్ఫ్ విభాగంలో..
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 3 – శుభంకర్ శర్మ మరియు గగన్‌జీత్ భుల్లర్ – మధ్యాహ్నం 12:30.

ఆర్చరీ విభాగంలో..
మహిళల వ్యక్తిగత రౌండ్ 16 – దీపికా కుమారి vs మిచెల్ క్రాపెన్ (GER) – 1:52 PM
మహిళల వ్యక్తిగత రౌండ్ 16 – భజన్ కౌర్ vs దయానంద చోయిరునిస్సా (INA) – 2:05 PM
మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఆధారంగా) – 4:30 PM
మహిళల వ్యక్తిగత సెమీఫైనల్స్ (అర్హత ఆధారంగా) – 5:22 PM
మహిళల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్ (అర్హత ఆధారంగా) – 6:03 PM
మహిళల వ్యక్తిగత గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హత ఆధారంగా) – సాయంత్రం 6:16.

సెయిలింగ్ విభాగంలో..
పురుషుల డింగీ ఓపెనింగ్ సిరీస్ (రేస్ 5) – విష్ణు శరవణన్ – మధ్యాహ్నం 3:45
పురుషుల డింగీ ఓపెనింగ్ సిరీస్ (రేస్ 6) – విష్ణు శరవణన్ – సాయంత్రం 4.53
మహిళల డింగీ ఓపెనింగ్ సిరీస్ (రేస్ 4) – నేత్ర కుమనన్ – మధ్యాహ్నం 3:35 గంటలకు
మహిళల డింగీ ఓపెనింగ్ సిరీస్ (రేస్ 5) – నేత్ర కుమనన్ – సాయంత్రం 5.55 గంటలకు
మహిళల డింగీ ఓపెనింగ్ సిరీస్ (రేస్ 6) – నేత్ర కుమనన్ – రాత్రి 7.03 గంటలకు.

బాక్సింగ్ విభాగంలో..
పురుషుల 71 కేజీల (క్వార్టర్ ఫైనల్) – నిషాంత్ దేవ్ vs మార్కో అలోన్సో వెర్డే అల్వారెజ్ – ఉదయం 12:18 (ఆగస్టు 4).

 

 

ట్రెండింగ్ వార్తలు