ఒలింపిక్స్‌లో ఇవాళ కీలక ఈవెంట్లు.. లక్ష్యసేన్ వైపు భారత్ చూపు.. 100 మీటర్ల పరుగులో విజేత ఎవరో?

భారత్ క్రీడాభిమానుల చూపంతా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ వైపు ఉంది. ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీస్ లో ఒలింపిక్ ఛాంపియన్ డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సెన్ తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.

Lakshya Sen

Paris Olympics 2024 : పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ 2024లో తొమ్మిదో రోజు (ఇవాళ) కీలక ఈవెంట్లు జరగనున్నాయి. ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో భారత్ కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. శనివారం భారత్ కు కలిసిరాలేదు. భారత్ అథ్లెట్స్ నిరాశ పర్చారు. షూటింగ్ విభాగంలో మను బాకర్ మూడో పతకం తెలుస్తుందని భారత్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, 25మీటర్ల పిస్టల్ లో మను బాకర్ నాలుగో స్థానంకే పరిమితమైంది. మరోవైపు బాక్సింగ్ లో నిశాంత్ దేవ్ పోరాడినా పతకానికి అడుగు దూరంలో ఆగిపోయాడు. 71 కేజీల క్వార్టర్స్ లో మెక్సికో క్రీడాకారుడు అల్వారెజ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆర్చరీలో దీపికా కుమారి, భజన్ కౌర్‌ల ఓటమితో భారత్ సవాల్ ముగిసింది. గోల్ఫ్, సెయిలింగ్ బోటింగ్‌లో కూడా భారత ఆటగాళ్లు అంచనాలను అందుకోలేకపోయారు.

Also Read : Paris Olympics 2024 : హార్ట్ బ్రేకింగ్‌.. మ‌ను భాక‌ర్ ఓట‌మి.. తృటిలో చేజారిన ప‌త‌కం..

భారత్ క్రీడాభిమానుల చూపంతా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ వైపు ఉంది. ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీస్ లో ఒలింపిక్ ఛాంపియన్ డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సెన్ తో లక్ష్యసేన్ తలపడనున్నాడు. ఈ సీజన్ లో అక్సెల్సెన్ ఫామ్ గొప్పగా లేకపోవడం లక్ష్యసేన్ కు కలిసొచ్చే అంశం. మరోవైపు భారత హాకీ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. ఆదివారం క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెం.2 బ్రిటన్ తో ప్రపంచ నం. 5 స్థానంలో ఉన్న భారత్ జట్టు తలపడబోతుంది. ఆస్ట్రేలియాపై తొలి రెండు క్వార్టర్స్ లో భారత్ దూకుడుగా ఆడింది. అదే సత్ఫలితాన్ని ఇచ్చింది. ఇదే ఆట బ్రిటన్ పైనా ప్రదర్శిస్తే పైచేయి సాధించడం కష్టమేం కాదు. ఇక ఒలింపిక్స్ లో అత్యంత ఆకర్షణీయ ఈవెంట్ పురుషుల వంద పరుగుల ఈవెంట్. ఈ ఈవెంట్ లో ఆదివారం ముందుగా సెమీస్ జరుగుతాయి. అవి పూర్తయిన రెండు గంటల తరువాత ఒలింపిక్స్ కే తలమానికమైన ఫైనల్ ఉంటుంది.

Also Read : Arshdeep Singh : తోపు బ్యాట‌ర్‌లా షాట్‌కు వెళ్లావా..! అర్ష్‌దీప్ సింగ్ పై నెట్టింట దారుణ ట్రోలింగ్‌..

ఒలింపిక్స్ లో ఈరోజు (ఆదివారం) భారత అథ్లెట్స్ పోరు..
12:30 PM – గోల్ఫ్ – పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 4 – శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్
12:30 PM – షూటింగ్ – 25m ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్-స్టేజ్ 1 – అనిష్ భన్వాలా, విజయ్‌వీర్ సిద్ధు
1 PM – షూటింగ్ – స్కీట్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ డే 2 – మహేశ్వరి చౌహాన్, రైజా ధిల్లాన్
1:30 PM – హాకీ – పురుషుల క్వార్టర్ ఫైనల్స్ – భారతదేశం vs గ్రేట్ బ్రిటన్
1:35 PM – అథ్లెటిక్స్ – మహిళల 3000మీ స్టీపుల్‌చేజ్ రౌండ్ 1 – పరుల్ చౌదరి
2:30 PM – అథ్లెటిక్స్ – పురుషుల లాంగ్ జంప్ అర్హత – జెస్విన్ ఆల్డ్రిన్
3:02 PM – బాక్సింగ్ – మహిళల 75 కిలోల క్వార్టర్ ఫైనల్స్ – లోవ్లినా బోర్గోహైన్ vs లి కియాన్ (చైనా)
3:30 PM – బ్యాడ్మింటన్ – పురుషుల సెమీఫైనల్ – లక్ష్య సేన్ vs విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్)
3:35 PM – సెయిలింగ్ – పురుషుల డింగీ రేస్ 7-8 – విష్ణు శరవణన్
4:30 PM – షూటింగ్ – 25m ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్-స్టేజ్ 2 – అనిష్ భన్వాలా, విజయ్‌వీర్ సిద్ధు
6:05 PM – సెయిలింగ్ – మహిళల డింగీ రేస్ 7-8 – నేత్ర కుమనన్
7 PM – షూటింగ్ – స్కీట్ ఉమెన్స్ ఫైనల్ – మహేశ్వరి చౌహాన్, రజా ధిల్లాన్ (అర్హతకు లోబడి)

ప్రధాన ఈవెంట్లు..
మధ్యాహ్నం 3.30గంటలకు టెన్నిస్ : పురుషుల ఫైనల్ (జకోవిచ్ వర్సెస్ అల్కరాస్)
సాయంత్రం 6గంటలకు టేబుల్ టెన్నిస్ : పురుషుల సింగిల్స్ ఫైనల్
రాత్రి 7.10గంటలకు జిమ్నాస్టిక్స్ : మహిళల అన్ ఈవెన్ బార్స్ ఫైనల్
రాత్రి 10 గంటలకు స్విమ్మింగ్ : మహిళల 50 మీ. ఫ్రీ స్టైల్ ఫైనల్.
రాత్రి 10.07గంటలకు స్విమ్మింగ్ : పురుషుల 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ ఫైనల్.
రాత్రి 11.25 గంటలకు : మహిళల హైజంప్ ఫైనల్
రాత్రి 12గంటలకు : పురుషుల హ్యామర్ త్రో ఫైనల్
రాత్రి 1.20 గంటలకు పురుషుల 100 మీటర్ల ఫైనల్

 

 

ట్రెండింగ్ వార్తలు