Pat Cummins and Nathan Lyon were ruled out of the fourth Ashes Test against England
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని 4-0 కి పెంచుకోవాలని ఆరాటపడుతోంది. మరోవైపు ఈమ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.
ఇదిలా ఉంటే.. బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం అయ్యాడు. అనారోగ్యంతో మూడో టెస్టు మ్యాచ్‌కు దూరం అయిన సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కమిన్స్ గైర్హాజరీలో అతడే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
U19 Asia Cup 2025 : ఫైనల్‌లో పాక్ చేతిలో ఘోర ఓటమి.. బీసీసీఐ సీరియస్.. ఇక..
కమిన్స్ గత కొంతకాలంగా నడుమునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు చాలా మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. యాషెస్ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు సైతం ఆడలేదు. ఫిట్‌నెస్ సాధించడంతో మూడో టెస్టులో ఆడాడు. అయితే.. ఏలాగూ ఆసీస్ సిరీస్ గెలవడం, మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ 2026 ఉండడంతో అతడికి విశ్రాంతి ఇవ్వాలని ఆసీస్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది.
మూడో టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు గాయపడిన స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా నాలుగో టెస్టుకు దూరం అయ్యాడు. అతడి స్థానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ ని జట్టులోకి తీసుకున్నారు. ఇక కమిన్స్ స్థానంలో పేసర్ జై రిచర్డ్‌సన్ చోటు దక్కించుకున్నాడు. అతడు చివరిసారిగా ఆసీస్ తరుపున 2021లో టెస్టు మ్యాచ్ ఆడడం గమనార్హం. దాదాపు నాలుగేళ్ల తర్వాత అతడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
Krishnappa Gowtham : క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమ్ ఇండియా క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్
బాక్సింగ్ డే టెస్టుకు ఆసీస్ జట్టు ఇదే..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నేజర్, జై రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.