Pat Cummins : రాజ‌స్థాన్ పై విజ‌యం.. కెప్టెన్ క‌మిన్స్ కీల‌క వ్యాఖ్య‌లు.. టోర్నీ ఆరంభం నుంచి మా ల‌క్ష్యం ఒక్క‌టే..

రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌లో త‌మ గెలుపుకు కార‌ణం షాబాజ్‌ను అహ్మ‌ద్‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఆడించ‌డ‌మే అని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ తెలిపాడు.

Pat Cummins – Daniel Vettori : ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫైన‌ల్‌కు చేరుకుంది. శుక్ర‌వారం క్వాలిఫ‌య‌ర్ 2లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను 36 ప‌రుగుల తేడాతో ఓడించింది. ఈ సీజ‌న్‌లో క‌ప్పును ముద్దాడేందుకు కేవ‌లం అడుగు దూరంలో నిలిచింది. కాగా.. రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌లో త‌మ గెలుపుకు కార‌ణం షాబాజ్‌ను అహ్మ‌ద్‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఆడించ‌డ‌మే అని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ తెలిపాడు. అయితే.. ఇది త‌న నిర్ణ‌యం కాద‌ని, కోచ్ డానియ‌ల్ వెటోరి నిర్ణ‌య‌మ‌ని చెప్పాడు. ఇక అభిషేక్ శ‌ర్మ రెండు వికెట్లు తీయ‌డం త‌న‌ను స‌ర్‌ప్రైజ్‌కు గురి చేసింద‌న్నాడు.

ఆర్ఆర్ పై విజ‌యం అనంత‌రం పాట్ క‌మిన్స్ మాట్లాడుతూ.. ఈ సీజ‌న్‌లో కుర్రాళ్లు అద్భుతంగా ఆడుతున్నార‌ని కితాబు ఇచ్చాడు. ఈ సీజ‌న్ ఆరంభం నుంచి కూడా త‌మ ల‌క్ష్యం ఫైన‌ల్‌కు చేరుకోవ‌డ‌మే అని చెప్పాడు. ఇప్పుడు దాన్ని అందుకున్న‌ట్లు తెలిపాడు. ఇక త‌మ జ‌ట్టు ప్ర‌ధాన బ‌లం బ్యాటింగ్ అని తెలుసని అన్నాడు. అయిన‌ప్ప‌టికీ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, న‌ట‌రాజ‌న్‌, జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ వంటి వారి అనుభ‌వంతో త‌న ప‌ని మ‌రింత సులువు అయ్యింద‌న్నాడు.

Kavya Maran : ఫైన‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ .. కావ్యా పాప సంబ‌రాలు చూశారా?

ఇక షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఆడించ‌డం పై క‌మిన్స్ మాట్లాడుతూ.. ఇది త‌న నిర్ణ‌యం కాద‌ని చెప్పాడు. అత‌డిని ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా తీసుకువ‌చ్చి, బౌలింగ్ చేయించాల‌న్న‌ది కోచ్ డేనియ‌ర్ వెటోరిది అని తెలిపాడు. ఇక అభిషేక్ శ‌ర్మ రెండు వికెట్లు తీయ‌డం త‌న‌కు పెద్ద స‌ర్‌ప్రైజ్ అని అన్నాడు. ఈ పిచ్ పై 170 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించ‌డం క‌ష్టం. కొన్ని వికెట్లు తీశాక మ్యాచ్ పై ప‌ట్టు సాధించామ‌ని క‌మిన్స్ చెప్పాడు.

ఇక పిచ్ గురించి తాను పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ని, ప్ర‌తీ వారం ప‌రిస్థితులు మారుతూనే ఉంటాయ‌న్నాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ విజ‌యం కోసం ప్రాంఛైజీ త‌రుపున 60 నుంచి 70 మంది క‌ష్ట‌ప‌డుతున్నార‌న్నాడు. ఇక ఫైన‌ల్ మ్యాచ్‌లో ఒక్క‌టే మిగిలి ఉంద‌ని, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఓడించి క‌ప్పును గెలుచుకుంటామ‌నే ధీమాను క‌మిన్స్ వ్య‌క్తం చేశాడు.

Virat Kohli : ఐపీఎల్ నుంచి ఆర్‌సీబీ ఔట్‌.. విరాట్ కోహ్లి పోస్ట్ వైర‌ల్‌

క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 50) అర్థ‌శ‌త‌కం బాద‌గా, రాహుల్ త్రిపాఠి (12 బంతుల్లో 37) దూకుడుగా ఆడారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగుల‌కే ప‌రిమిత‌మైంది.

ట్రెండింగ్ వార్తలు