Kavya Maran : ఫైన‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ .. కావ్యా పాప సంబ‌రాలు చూశారా?

కొత్త కెప్టెన్ పాట్ క‌మిన్స్ సార‌థ్యంలో ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది.

Kavya Maran : ఫైన‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ .. కావ్యా పాప సంబ‌రాలు చూశారా?

screengrab from video posted on x by@jiocinema

Kavya Maran Reaction : గ‌త కొన్ని సీజ‌న్లుగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మాత్రం అద‌ర‌గొడుతోంది. కొత్త కెప్టెన్ పాట్ క‌మిన్స్ సార‌థ్యంలో ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. శుక్ర‌వారం చెపాక్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 36 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆరేళ్ల త‌రువాత స‌న్‌రైజ‌ర్స్ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది.

ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 50) అర్థ‌శ‌త‌కం బాద‌గా, రాహుల్ త్రిపాఠి (12 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో అవేశ్ ఖాన్‌, ట్రెంట్ బౌల్ట్ చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సందీప్ శ‌ర్మ రెండు వికెట్లు తీశాడు.

SRH : 6 ఏళ్ల త‌రువాత ఫైన‌ల్‌కు చేరిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌.. క‌మిన్స్ అరుదైన రికార్డు..

ఆ త‌రువాత ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌డ‌బ‌డింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగుల‌కే ప‌రిమిత‌మైంది. ధ్రువ్ జురెల్ (35 బంతుల్లో 56నాటౌట్), య‌శ‌స్వి జైస్వాల్ (21బంతుల్లో 42) లు రాణించినా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. దీంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో షాబాద్ మూడు ప‌డ‌గొట్టాడు. అభిషేక్ శ‌ర్మ రెండు, పాట్ క‌మిన్స్‌, న‌ట‌రాజ‌న్‌లు చెరో వికెట్ తీశారు.

కావ్యా మార‌న్ సంబురాలు..

డేవిడ్ వార్న‌ర్ కెప్టెన్సీలో 2016లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆ త‌రువాత 2018లో తృటిలో ఈ అవ‌కాశం చేజారింది. ఫైన‌ల్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్ చేతిలో ఓట‌మి పాలైంది. దాదాపుగా ఆరేళ్లుగా స‌న్‌రైజ‌ర్స్ ప్ర‌ద‌ర్శ‌న దిగ‌జారుతూ వ‌స్తోంది. అయితే.. ఎట్ట‌కేల‌కు ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఫైన‌ల్‌కు చేరుకోవ‌డంతో కావ్యా పాప ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

Sania Mirza : ఇంటి నేమ్‌ప్లేట్‌ను మార్చేసిన మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. కొత్త నేమ్‌ప్లేట్‌లో ఎవ‌రి పేరుందంటే?

స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం ఖ‌రారు కాగానే ఎగిరి గంతులేసింది. ఆమె తండ్రి క‌ళానిధి మార‌న్‌ను కౌగించుకుని త‌న ఆనందాన్ని పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆదివారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. చెపాక్ వేదిక‌గానే ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.