Pat Cummins and Jasprit bumrah
Perth Test: బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. తొలి టెస్టు ఈనెల 22న (శుక్రవారం) ఉదయం 7.50గంటలకు పెర్త్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు పాంట్ కమిన్స్, జస్ర్పీత్ బుమ్రా ట్రోపీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించాడు.
Also Read: Mohammed Shami: టీమిండియా మాజీ క్రికెటర్ పై మహ్మద్ షమీ తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే?
చిరకాల ప్రత్యర్థి భారత్ జట్టుతో బోర్డర్ గావస్కర్ ట్రోపీ హోరాహోరీగా సాగుతుందని ఆశిస్తున్నాను. అయితే, భారత్ జట్టు తమ సొంతగడ్డపై వరుసగా మూడు టెస్టులు ఓడిపోయిన తరువాత మాతో మాగడ్డపై తలపడుతుంది. వారిపై ఒత్తిడి ఉండటం సహజమే. అదేసమయంలో ఆస్ట్రేలియా జట్టుపైనా ఒత్తిడి ఎక్కువగానే ఉంది. ఎందుకంటే స్వదేశంలో ఆడుతున్నప్పుడు ఏ జట్టుకైనా కాస్త ఒత్తిడి ఉంటుందని కమిన్స్ చెప్పాడు. భారత్ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. మాకు మంచి సవాల్ ను విసురుతారని భావిస్తున్నాను. అయితే, మేము ప్రత్యర్థి జట్టు గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని కమిన్స్ అన్నాడు. డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన కొత్త బ్యాటర్ నాథన్ మెక్ స్వీనీ తన సహజమైన ఆటను ప్రదర్శించాల్సి ఉంది. వార్నర్ లా ఆడేందుకు ప్రయత్నించకూడదు.
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో సహచర ఆటగాడు నితీశ్ రెడ్డి గురించి కమిన్స్ మాట్లాడారు. సన్ రైజర్స్ జట్టులో నితీశ్ రెడ్డి ప్రతిభావంతమైన ఆటగాడు. అతను బంతిని స్వింగ్ చేయడంలో దిట్ట అంటూ కమిన్స్ కొనియాడారు.
భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన (నవంబర్ 2024 – జనవరి 2025)
22-26 నవంబర్ : 1వ టెస్టు, పెర్త్
6-10 డిసెంబర్ : 2వ టెస్టు, అడిలైడ్
14-18 డిసెంబర్ : 3వ టెస్టు, బ్రిస్బేన్
26-30 డిసెంబర్ : 4వ టెస్టు, మెల్బోర్న్
03-07 జనవరి : 5వ టెస్టు, సిడ్నీ