Pat Cummins : ప్ర‌పంచ ఛాంపియ‌న్ల‌ను ప‌ట్టించుకోలేదు..! ఆశ్చ‌ర్య‌పోతున్న నెటీజ‌న్లు

Pat Cummins team : వ‌న్డే ప్ర‌పంచక‌ప్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Pat Cummins Reaches Australia

వ‌న్డే ప్ర‌పంచక‌ప్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌తీ ఒక్క జ‌ట్టు కూడా ఒక్క‌సారైనా ఈ క‌ప్పును ముద్దాడాల‌ని భావిస్తాయి. అందుకోసం శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నిస్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని జ‌ట్ల‌కు మాత్ర‌మే సాధ్యంకాగా.. చాలా జ‌ట్ల‌కు అంద‌ని ద్రాక్ష‌గా మిగిలింది. అలాంటి క‌ప్పును గెలుచుకుని తిరిగి స్వ‌దేశానికి చేరుకున్న‌ జ‌ట్టుకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌లుకడాన్ని చూస్తూనే ఉంటాం. మ‌రీ ఎవ్వ‌రికీ సాధ్యం కానీ రీతిలో ఆరో సారి క‌ప్పును కైవ‌సం చేసుకుని స్వ‌దేశానికి చేరుకున్న జ‌ట్టుకు అభిమానులు ఎలాంటి స్వాగ‌తం ప‌లుకుతారో ఊహించ‌డం కాస్త క‌ష్ట‌మే.

భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. దీంతో ఆరోసారి క‌ప్పును గెలుచుకున్న ఆ జ‌ట్టు బుధ‌వారం ఉద‌యం స్వ‌దేశానికి చేరుకుంది. అయితే.. విశ్వ‌విజేత‌ల‌కు అతి సాధార‌ణ‌మైన స్వాగ‌తం ల‌భించింది. అభిమానులు ఎవ్వ‌రూ కూడా ఎయిర్ పోర్టుకు రాలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.  ఆసీస్ క్రికెట‌ర్లకు ఘ‌న స్వాగ‌తం ల‌భించ‌క‌పోవ‌డం ప‌ట్ల నెటీజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Gautam Gambhir : ల‌క్నోకు గుడ్ బై.. తిరిగి సొంత గూటికి గౌత‌మ్ గంభీర్‌

ఎయిర్ పోర్టులో ఆసీస్ క్రికెట‌ర్లు సాధార‌ణ ప్యాసింజ‌ర్ల‌లా త‌మ ల‌గేజ్‌ను తామే మోసుకువెళ్ల‌డం క‌నిపిస్తోంది. కేవ‌లం ఫోటో గ్రాఫ‌ర్లును మాత్ర‌మే ఉన్నారు.

‘ప్ర‌తి నాలుగు సంవ‌త్స‌రాల‌కు ఒకసారి మాత్ర‌మే ఇలాంటి అవకాశం ల‌భిస్తుంది. మేము ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలిచాం. మేము చాలా కాలం పాటు సంతోషంగా ఉంటాం. భార‌తదేశం లాంటి చోట్ల క‌ప్పును సొంతం చేసుకోవ‌డంతో ఆనందాన్ని క‌లిగించే విష‌యం.’ అని క‌మిన్స్ మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు.

Amelia Kerr : ట‌వ‌ల్‌తో బంతిని ప‌ట్టుకుంది.. భారీ మూల్యం చెల్లించుకుంది.. వీడియో వైర‌ల్‌

ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన ఆస్ట్రేలియా జ‌ట్టు మొత్తం స్వ‌దేశానికి వెళ్లిపోలేదు. భార‌త్‌తో టీ 20 సిరీస్ కోసం ప‌లువురు ఆట‌గాళ్లు విశాఖ‌కు వెళ్ల‌గా పొట్టి ఫార్మాట్‌లో చోటు ద‌క్క‌ని ఆట‌గాళ్లు ఆస్ట్రేలియాకు వెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు