IPL 2024 : సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ పట్టిన క్యాచ్ మ్యాచ్ కు హైలెట్ గా నిలిచింది. పంజాబ్ కింగ్స్ జట్టు 53 పరుగుల వద్ద

Pat Cummins

PBKS vs SRH Match : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. తొలి పది ఓవర్లలో 66 పరుగులే చేసిన హైదరాబాద్ జట్టు.. ఆఖరి 10 ఓవర్లలో నితీశ్ కుమార్ రెడ్డి విజృంభణతో 116 పరుగులు రాబట్టింది. నితీశ్ కేవలం 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సులతో 64 పరుగులు చేశాడు. ఆ తరువాత 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

Also Read : IPL 2024 : పోరాడి ఓడిన పంజాబ్‌.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం..!

మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. పంజాబ్ ఆఖరి నాలుగు ఓవర్లలో 67 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉండగా.. మ్యాచ్ పంజాబ్ చేజారిపోయిందని అందరూ భావించారు. కానీ, చివర్లో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లుగా మ్యాచ్ సాగింది.. ఆఖరికి రెండు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టు ఓడిపోయింది.

Also Read : రుతురాజ్ ఆటతీరుపై ఇంగ్లండ్ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ మోర్గాన్ ప్రశంసల జల్లు.. ఏమని వర్ణించాడో తెలుసా?

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమ్మిన్స్ పట్టిన క్యాచ్ ఈ మ్యాచ్ కు హైలెట్ గా నిలిచింది. పంజాబ్ కింగ్స్ జట్టు 53 పరుగుల వద్ద ఉండగా తొమ్మిదో ఓవర్ జానీ బెయిర్ స్టో బౌలింగ్ చేశాడు. సామ్ కర్రాన్ తొలి బంతిని సిక్స్ కొట్టే ప్రయత్నం చేయగా.. కమ్మిన్స్ వెనక్కు పరుగెడుతూ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు.. ఈ మ్యాచ్ లో కమ్మిన్స్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

 

ట్రెండింగ్ వార్తలు