×
Ad

T20 World Cup 2026: దెబ్బకు దెయ్యం దిగింది.. ICC ఝలక్ తో వెంటనే టీమ్ ని ప్రకటించిన పాకిస్తాన్

Pakistan Squad : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్ కప్‌కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలో 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఆదివారం ప్రకటించింది.

Pakistan Squad

  • టీ20 వరల్డ్‌కప్ కోసం జట్టును ప్రకటించిన పీసీబీ
  • రివూఫ్, రిజ్వాన్‌లకు దక్కని చోటు
  • బాబర్ అజామ్, షహీన్ షా అఫ్రీదిలకు చోటు

Pakistan Squad : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్ కప్‌కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలో 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఆదివారం ప్రకటించింది. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రీదికి అవకాశం కల్పించిన పీసీబీ.. రవూఫ్, మహ్మద్ రిజర్వాన్‌లను పక్కన పెట్టింది.

Also Read : T20 World Cup : బంగ్లాదేశ్ జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు.. ఆ దేశం ఎన్నికోట్లు నష్టపోతుందో తెలుసా?

ఆకిబ్ జావెద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ఆధ్వర్యంలో సమతూకంతో కూడిన, దూకుడైన జట్టును ఎంపిక చేసినట్లు పీసీబీ పేర్కొంది. పాకిస్థాన్ స్టార్ ప్లేయర్లు బాబర్ అజామ్, షాహీన్ షా అఫ్రిదీ తిరిగి జట్టులోకి రావడం పాక్ అభిమానులకు ఊరటనిచ్చే అంశం. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో జట్టు ఎంపికలో కొన్ని అనూహ్య నిర్ణయాలు కూడా తీసుకుంది. స్టార్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ పై సెలెక్టర్లు వేటు వేశారు. ఫామ్ కోల్పోవడం, ఫిట్ నెస్ సమస్యల కారణంగా అతన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

T20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టు ఇదే..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ తారి


ఐసీసీ వార్నింగ్.. గంటల వ్యవధిలోనే జట్టు ప్రకటన..
టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ జట్టును ఐసీసీ తప్పించిన విషయం తెలిసిందే. అయితే, బంగ్లాదేశ్ జట్టు బాటలోనే పాకిస్థాన్ జట్టు పయణిస్తుందని, టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి ఆ జట్టు తప్పుకునేందుకు సిద్ధమవుతుందని వార్తలు వచ్చాయి. మరోవైపు.. బంగ్లాదేశ్ జట్టు పట్ల ఐసీసీ అన్యాయంగా వ్యవహరించిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నఖ్వీ వ్యాఖ్యానించాడు. నఖ్వీ వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ఇదేక్రమంలో టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్ జట్టు తప్పుకునే విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నఖ్వీ వ్యాఖ్యానించారు. ఒకవేళ పాకిస్థాన్ జట్టు టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే ఆ దేశ క్రికెట్ బోర్డుపై తీవ్ర ఆంక్షలు విధించేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఈ క్రమంలో పాకిస్థాన్ మెగా టోర్నీ కోసం తమ జట్టును ప్రకటించింది.