ఫిట్‌నెస్‌ తగ్గితే క్రికెటర్ల శాలరీలు కట్

ప్లేయర్లకు ఫిట్‌నెస్ తప్పనిసరని తెలిసిందే కానీ, ఫిట్‌నెస్ మీదే ఆధారపడి మ్యాచ్ ఫీజులు డిసైడ్ అవుతాయని ఊహించి ఉండరు. పాక్ ప్లేయర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఇదే షాక్ ఇచ్చింది. దానికి కారణం లేకపోలేదు.. 2019వరల్డ్ కప్ సమయంలో పాకి్ క్రికెటర్లు అభిమానులుతో కలిసి పిజ్జాలు, బర్గర్లు తింటున్న వీడియోలు వైరల్ అయ్యాయి. 

వీటిపై దృష్టి పెట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ టెస్టులను నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్ యాసిర్ మాలిక్ పర్యవేక్షించనున్నారు. జనవరి 6, 7తేదీలలో ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించి వివరాలను మీడియా వేదికగా బయటపెట్టనుంది పాక్ క్రికెట్ బోర్డు. ఈ మేర బీపీఎల్‌లో ఆడుతున్న వహబ్ రియాజ్, మొహమ్మద్ అమీర్, షాదబ్ ఖాన్‌లకు కాస్త విరామం ఇస్తూ జనవరి 20, 21తేదీల్లో ఫిట్‌నెస్ టెస్టులకు హాజరు అవ్వాలంటూ ఆదేశాలందాయి. 

ఫిట్‌నెస్ మెయింటైన్ చేయకపోతే 15శాతం ఫైన్ కూడా.. ఫిట్‌నెస్‌కు తగ్గ వేతనంతో పాటు తగ్గితే.. ఫైన్ కూడా వేయనున్నారు. ఏ నెలలో ఫిట్‌నెస్ తగ్గిందో.. ఆ నెల ప్లేయర్ వేతనం నుంచి 15శాతం ఫీజును కట్ చేస్తారు. పీసీబీ డైరక్టర్ జాకీర్ ఖాన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వరల్డ్ కప్ ఓటమి తర్వాత జట్టును పర్‌ఫెక్ట్ చేయడంతో పాటు ఉన్నత స్థాయికి తీసుకెళతామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

జీతాలు తీసుకునే కాంట్రాక్ట్ ప్లేయర్ల వివరాలు:
Category A– Babar Azam, Sarfaraz Ahmed, Yasir Shah
Category B– Asad Shafiq, Azhar Ali, Haris Sohail, Imam-ul-Haq, Mohammad Abbas, Shadab Khan, Shaheen Shah Afridi
Category C– Abid Ali, Hasan Ali, Fakhar Zaman, Imad Wasim, Mohammad Amir, Mohammad Rizwan, Shan Masood, Usman Shinwari, Wahab Riaz.

ట్రెండింగ్ వార్తలు