IND vs AUS : బౌల‌ర్ల హ‌వా.. ముగిసిన తొలి రోజు ఆట‌.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్కోరు 67/7

పెర్త్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది.

Perth test Day 1 Stumps Australia trail by 83 runs

IND vs AUS : పెర్త్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఫాస్ట్ బౌల‌ర్లు చెల‌రేగుతున్నారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవ‌ర్ల‌లో 150 ప‌రుగుల‌కే భార‌త్ కుప్ప‌కూలింది. అనంత‌రం టీమ్ఇండియా బౌల‌ర్ల ధాటికి మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 27 ఓవ‌ర్ల‌లో 67/7తో నిలిచింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆసీస్ ఇంకా 83 ప‌రుగులు వెనుక బ‌డి ఉంది.

క్రీజులో మిచెల్ స్టార్క్ (6), అలెక్స్ క్యారీ (19) లు ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో కెప్టెన్ జ‌స్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. మ‌హ్మ‌ద్ సిరాజ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, హ‌ర్షిత్ రాణా ఓ వికెట్ సాధించాడు. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ఖ‌వాజా (8), నాథన్ మెక్‌స్వీనీ (10), మార్న‌స్ ల‌బుషేన్ (2), స్టీవ్ స్మిత్ (0), ట్రావిస్ హెడ్ (11), మిచెల్ మార్ష్ (6) లు విఫ‌లం అయ్యారు.

IND vs AUS : పెర్త్ టెస్టు.. చేతులెత్తేసిన బ్యాట‌ర్లు.. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 150 ఆలౌట్‌..

కాగా.. పెర్త్‌లో ఒకే రోజు 17 వికెట్లు ప‌డ‌డం 1952 త‌రువాత ఇదే తొలిసారి. కాగా.. ఈ వికెట్లు అన్నీ కూడా పేసర్ల‌కే ప‌డ్డాయి. పిచ్ ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా ఉండ‌డంతో రెండో రోజు ఆసీస్‌ను వీలైన తొంద‌ర‌గా ఆలౌట్ చేసి భార‌త బ్యాట‌ర్లు ఎలా ఆడ‌తారు అన్న దానిపైనే మ్యాచ్ ఫ‌లితం ఆధార‌ప‌డి ఉంది.