Telugu Titans : ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్(Telugu Titans)కు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.
ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడిపోగా శనివారం యూపీ యోధాస్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 40-35 తేడాతో పరాజయం పాలైంది.
సొంతగడ్డ (విశాఖ)పై జరుగుతున్న మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతుంది.
ఈ మ్యాచ్ ఆరంభంలో కెప్టెన్ విజయ్ మాలిక్ రాణించడంతో టైటాన్స్ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే.. యోధాస్ నెమ్మదిగా పుంజుకుంది.
గగన్ గౌడ, భరత్ హుడా రాణించడంతో ఎనిమిదో నిమిషంలోనే తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేసింది. విరామ సమయానికి 21-13 ఆధిక్యంలోకి యోధాస్ దూసుకుపోయింది.
Asia Cup 2025 : మ్యాచ్ టైమింగ్‌లో మార్పులు.. ఆ ఒక్కటి మినహా.. భారత కాలమానం ప్రకారం ఎప్పుడంటే..?
బ్రేక్ అనంతరం టైటాన్స్ రాణించినప్పటికి కూడా.. యోధాస్ తమ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. విజయ్ మాలిక్ (14) ఒంటరి పోరాటం చేశాడు. అతడికి మిగిలిన ఆటగాళ్ల నుంచి పెద్దగా సహకారం దక్కలేదు. చేతన్ సాహు 4, భరత్ 3 పాయింట్లు సాధించారు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 14 పాయింట్లు సాధించగా సమిత్ 8 పాయింట్లు, గుమాన్ సింగ్ 7 పాయింట్లు సాధించారు.