Players are responsible for scoring runs Suresh Raina defended Gautam Gambhir
IND vs SA : టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మిగిలిన ఫార్మాట్లలో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా సరే టెస్టు క్రికెట్‌లో మాత్రం ఘోర పరాజయాలను చవిచూస్తోంది. గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో వైట్ వాష్ అయింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ 0-1తో వెనుకబడి ఉంది. గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఓటమి అంచున ఉంది. ఈ క్రమంలో హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను తప్పించాలన్న డిమాండ్లు మరింత ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు మద్దతుగా నిలిచాడు. ఓటములకు కోచ్ కన్నా ఎక్కువగా కూడా ఆటగాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నాడు. కోచ్‌గా అతడి పని అతడు చేసుకుంటూ వెలుతున్నాడని చెప్పుకొచ్చాడు.
Smriti Mandhana : ఆస్పత్రి నుంచి స్మృతి మంధాన తండ్రి డిశ్చార్జ్.. పెళ్లి ఎప్పుడంటే..?
కోచ్‌గా గౌతమ్ గంభీర్ చాలా కష్టపడి, నిజాయితీగా పని చేస్తున్నాడని తెలిపాడు. అతడి మార్గదర్శకంలో టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025 విజేతగానూ నిలిచిన విషయాలను గుర్తు చేశాడు. ఓ కోచ్ ఆటగాళ్లకు కేవలం దిశానిర్దేశం మాత్రమే చేయగలడు అని, బ్యాటర్లే పరుగులు సాధించాలని చెప్పుకొచ్చాడు.
ప్లేయర్లు చివరి వరకు మ్యాచ్ గెలుస్తామనే నమ్మకంతోనే ఆడాలన్నాడు. ఎప్పుడూ విశ్వాసం కోల్పోవద్దు అని అన్నాడు. తాను క్రికెట్ ఆడిన రోజుల్లో.. ఒకవేళ సిరీస్‌లో వెనుకబడ్డా తిరిగి పుంజుకుంటామనే గట్టి నమ్మకంతో ముందుకుసాగేవాళ్లమని అన్నాడు.
బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పడం పైనే విజయం ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఇక దేశవాళీ క్రికెట్ ఆడడం వల్ల ఆటగాళ్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నాడు.