×
Ad

మహిళల వన్డే ప్రపంచ కప్‌-2025 గెలిచిన జట్టును అభినందించిన మోదీ.. వీడియో చూస్తారా?

ప్రధాన కోచ్‌ అమోల్‌ మజుందార్‌ కూడా మోదీని కలిసిన వారిలో ఉన్నారు. జట్టును మోదీ అభినందించారు.

Womens World Cup: మహిళల వన్డే ప్రపంచ కప్‌- 2025 ఫైనల్లో గెలిచి భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ జట్టు కలిసింది. ప్రధాన కోచ్‌ అమోల్‌ మజుందార్‌ కూడా మోదీని కలిసిన వారిలో ఉన్నారు. జట్టును మోదీ అభినందించారు.

Also Read: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం.. ఓవర్‌ డోస్‌తో రూమ్‌లో యువకుడి మృతి, అపస్మారక స్థితిలోకి అతడి ప్రియురాలు

ప్రపంచ కప్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ అనంతరం టీమిండియా ధాటిగా ఆడిన తీరును గుర్తుచేసుకుని మరీ మోదీ ప్రశంసించారు. మహిళా ప్లేయర్లతో మోదీ మాట్లాడారు. భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదని, అది ప్రజల జీవితంలో భాగమైందని చెప్పారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఇవాళ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్‌ 52 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. 52 ఏళ్ల ఈ టోర్నమెంట్‌ చరిత్రలో భారత్‌ తొలిసారి టైటిల్‌ గెలుచుకుంది.

ప్రపంచకప్‌ గెలిచిన జట్లు

1973 – ఇంగ్లాండ్
1977/78 – ఆస్ట్రేలియా
1981/82 – ఆస్ట్రేలియా
1988/89 – ఆస్ట్రేలియా
1993 – ఇంగ్లాండ్
1997/98 – ఆస్ట్రేలియా
2000/01 – న్యూజిలాండ్
2004/05 – ఆస్ట్రేలియా
2008/09 – ఇంగ్లాండ్
2012/13 – ఆస్ట్రేలియా
2017 – ఇంగ్లాండ్
2021/22 – ఆస్ట్రేలియా
2025/26 – భారత్‌