హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఓవర్ డోస్‌తో రూమ్‌లో యువకుడి మృతి, అపస్మారక స్థితిలోకి అతడి ప్రియురాలు
ఆ డ్రగ్స్‌ను వారు హైదరాబాద్‌లోని నిలోఫర్ కేఫ్ వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం.
Representative Image
Rajendranagar: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ కలకలం చెలరేగింది. ఓవర్ డోస్‌తో అహ్మద్ అనే యువకుడు మృతి చెందాడు. మరో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.
పాతబస్తీలోని కాలాపత్తర్‌కు చెందిన అహ్మద్ అనే యువకుడు, కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లి కెన్ వరత్ అపార్ట్మెంట్‌లో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. (Rajendranagar)
Also Read: మరో బస్సు ప్రమాదం.. మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు
గత రాత్రి డ్రగ్స్ కొనుగోలు చేసి రూమ్‌లో ఆ యువతి, యువకుడు ఫుల్లుగా ఆ మత్తులో మునిగిపోయారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో అహ్మద్ మృతి చెందాడు. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
ఆ డ్రగ్స్‌ను వారు హైదరాబాద్‌లోని నిలోఫర్ కేఫ్ వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. డ్రగ్స్ టెస్ట్‌లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారన్న దానిపై రాజేంద్రనగర్ పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు.
