మరో బస్సు ప్రమాదం.. మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు

విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మరో బస్సు ప్రమాదం.. మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు

Updated On : November 6, 2025 / 10:07 AM IST

Bus Fire: ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమైంది. విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

డ్రైవర్ అప్రమత్తంగా ఉండి, బస్సును ఆపడంతో ప్రయాణికులు కిందకు దిగారు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పార్వతీపురం మన్యం జిల్లా బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సంధ్యారాణి వెంటనే స్పందించారు.

ఘటనాస్థలికి ఫైరింజన్‌ను పంపారు. ప్రమాదం గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాణనష్టం జరగలేదని మంత్రికి అధికారులు చెప్పారు.

ఈ జిల్లాల వారికి అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం 

కాగా, ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలోని చేవెళ్లలో ఒక టిప్పర్ లారీ బస్సును ఢీకొన్న ఘటనలో 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకుముందు కర్నూలులోనూ ఘోర బస్సు ప్రమాదం జరిగి, 20 మంది మృతి చెందారు. (Bus Fire)