ఈ జిల్లాల వారికి అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం 

నేడు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ జిల్లాల వారికి అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం 

Updated On : November 6, 2025 / 8:30 AM IST

Weather Updates: నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.

నేడు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది.

Also Read: నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ సిరీస్ చూసి.. అందులోని పాత్ర పేర్లతో అచ్చం అలాగే చేసి.. రూ.150 కోట్లు కొట్టేసి..

క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో తెలంగాణలోనూ తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, నల్గొండ, నిజామాబాద్, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది.