SL vs NZ : 2, 9, 7, 8, 10, 13, 1, 0, 29, 2, 2.. ఏంద‌న్నా ఇదీ న్యూజిలాండ్ ఫోన్ నెంబ‌ర్‌!

గాలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచులో న్యూజిలాండ్ త‌డ‌బ‌డింది.

Prabath Jayasuriya Takes 6 wickets New Zealand All Out For 88 in 2nd Test against SriLanka

గాలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచులో న్యూజిలాండ్ త‌డ‌బ‌డింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 602-5 స్కోరు వ‌ద్ద డిక్లేర్ చేసింది. అనంత‌రం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ 88 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో లంక‌కు 514 ప‌రుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

ఇక న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో మిచెల్ శాంట్న‌ర్ (29), డారిల్ మిచెల్ (13), ర‌చిన్ ర‌వీంద్ర (10)లు మాత్ర‌మే రెండు అంకెల స్కోర్లు చేయ‌గా మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. లంక బౌల‌ర్ల‌లో ప్ర‌భాత్‌ జ‌య‌సూర్య ఆరు వికెట్లు తీశాడు. నిషాన్ పీరిస్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా అసిత ఫెర్నాండో ఓ వికెట్ సాధించాడు.

Musheer Khan : రోడ్డు ప్ర‌మాదానికి గురైన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సోద‌రుడు ముషీర్ ఖాన్‌.. 3 నెల‌లు ఆట‌కు దూరం!

ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌కు సంబంధించిన స్కోర్ కార్డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వ‌రుస‌గా 11 మంది బ్యాట‌ర్ల స్కోరు.. 2, 9, 7, 8, 10, 13, 1, 0, 29, 2, 2 పోస్ట్ చేస్తూ ఏంద‌న్నా ఇదీ న్యూజిలాండ్ ఫోన్ నంబ‌రా అంటూ ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు.

 

2 గంట‌ల్లోనే మ‌ళ్లీ బ్యాటింగ్‌కు వ‌చ్చిన కేన్ మామ‌..

ఈ మ్యాచ్‌లో కేన్ విలిమ‌య్స‌న్ కేవ‌లం రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనే రెండో సారి బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. ఓవ‌ర్ నైట్ బ్యాట‌ర్‌గా మూడో రోజు క్రీజులోకి అడుగుపెట్టిన కేన్ మామ.. త‌న ఓవ‌ర్‌నైట్ స్కోరుకు మ‌రో ప‌రుగు మాత్ర‌మే జోడించి 7 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఇది మొద‌లు మూడో రోజు మొద‌టి సెష‌న్‌లో కివీస్ శ‌ర‌వేగంగా వికెట్లు కోల్పోయింది. లంచ్ స‌మ‌యాని క‌న్నా ముందే ఆలౌటైంది.

త‌క్కువ స్కోరుకే ఆలౌట్ కావ‌డంతో ఫాలో ఆన్ ఆడాల్సి వ‌చ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో బ‌రిలోకి దిగింది న్యూజిలాండ్. ఓపెన‌ర్లుగా టామ్ లాథ‌మ్, డేవాన్ కాన్వేలు క్రీజులోకి వ‌చ్చారు. అయితే.. తొలి ఓవ‌ర్ చివ‌రి బంతికి టామ్ లాథ‌మ్ డ‌కౌట్ అయ్యాడు. జ‌ట్టు స్కోరు ఖాతా తెర‌వ‌క ముందే కివీస్ వికెట్ కోల్పోయింది. వ‌న్‌డౌన్‌లో కేన్ విలియ‌మ్స‌న్ వ‌చ్చాడు.

IND vs BAN : భార‌త అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. మైదానం నుంచి హోట‌ల్‌కు వెళ్లిపోయిన టీమ్ఇండియా..

మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్ కోల్పోవ‌డంతో.. మొద‌టి ఇన్నింగ్స్ లో ఔటైన రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనే కేన్ మామ రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులోకి అడుగుపెట్టాల్సి వ‌చ్చింది. మ‌రో ఓవ‌ర్ త‌రువాత లంచ్ విరామం ఇచ్చారు. లంచ్ విరామానికి న్యూజిలాండ్ రెండు ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి మూడు ప‌రుగులు చేసింది. కేన్ విలియ‌మ్స‌న్ (1), డేవాన్ కాన్వే (2) లు క్రీజులో ఉన్నారు.