DP vs TT
Premier Handball League 2023: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (PHL) సీజన్‌ను వరుసగా రెండు విజయాలతో ఆరంభించింది తెలుగు టాలన్స్(Telugu Talons). అయితే ఆ తరువాత ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఆదివారం మహారాష్ట్ర ఐరన్ మెన్(Maharashtra Ironmen) చేతిలో ఓడిపోయిన టాలన్స్ సోమవారం ఢిల్లీ పాంజర్స్(Delhi Panzers)తో జరిగిన ఉత్కంఠ పోరులో పరాజయం పాలైంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ తేడాతో ఓటమిని చవిచూసింది. ఢిల్లీ ఆటగాడు దీపక్ 11 గోల్స్ నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు టాలన్స్ గోల్‌కీపర్ రాహుల్ 20 గోల్ ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నప్పటికీ 28-26తో పైచేయి సాధించిన ఢిల్లీ పాంజర్స్ సీజన్‌లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Premier Handball League: తెలుగు టాలన్స్‌కు భారీ షాక్.. ఈ సీజన్‌లో తొలిసారి
ఢిల్లీ పాంజర్స్‌తో మ్యాచ్‌ను తెలుగు టాలన్స్ దూకుడుగా ఆరంభించింది. తొలి నిమిషంలోనే గోల్ కొట్టిన టాలన్స్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఐదో నిమిషంలో గోల్ ఖాతా తెరిచిన ఢిల్లీ పాంజర్స్ నెమ్మదిగా పుంజుకుంది. ప్రథమార్థం ముగిసే సరికి 13-12తో తెలుగు టాలన్స్ ఆధిక్యంలో ఉంది. ద్వితీయార్థంలోనూ అదే దూకుడు కొనసాగించింది. విశాల్, అనిల్, రఘు, నసీబ్‌లకు తోడు దేవిందర్ సింగ్ రాణించటంతో 19-14, 22-17తో టాలన్స్ ఆధిక్యంలో నిలిచింది.
DP vs TT key moments
Pro Panja League: జూలై 28 నుంచి ప్రో పంజా లీగ్.. సత్తా చాటేందుకు సిద్దమైన కిరాక్ హైదరాబాద్
అయితే మ్యాచ్ మరో మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా.. ఢిల్లీ పాంజర్స్ అనూహ్యంగా రేసులోకి దూసుకువచ్చింది. 25-25తో స్కోరు సమం చేసిన ఢిల్లీ పాంజర్స్ ఆ తరువాత 28-25తో ముందంజ నిలిచింది. స్కోరు సమం చేసేందుకు ఆఖరి నిమిషంలో తెలుగు టాలన్స్ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో 26-28తో తేడాతో తెలుగు టాలన్స్ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది.