Prithvi Shaw Dropped From Mumbai Ranji Trophy Squad
Prithvi Shaw : టీమ్ఇండియా ఓపెనర్ ఫృథ్వీ షాకు షాక్ తగిలింది. రంజీట్రోఫీలో ముంబై జట్టు తరుపున ఆడుతున్న పృథ్వీని జట్టు నుంచి తప్పించారు. త్రిపురతో జరిగే మ్యాచ్‌కు ముంబై జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇందులో పృథ్వీకి చోటు దక్కలేదు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడిపై వేటు పడింది.
పృథ్వీ షాకు విరామం ఇచ్చారు. దీంతో అతడు త్రిపురతో మ్యాచ్‌కు దూరం అయ్యాడు. కోచ్, సెలక్టర్లు అతడితో ఇప్పటికే ఈ విషయం గురించి చర్చించారు. ఫిట్‌నెస్‌పై పృథ్వీ దృష్టి సారించాల్సి ఉందని ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అభయ్ హడప్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
India A vs UAE : అభిషేక్ శర్మ విధ్వంసం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్..
క్రిక్‌బజ్ ప్రకారం.. సంజయ్ పాటిల్, రవి ఠాకర్, జీతేంద్ర ఠాక్రే, కిరణ్ పొవార్, విక్రాంత్ యెలిగేటి, ప్రధాన కోచ్ ఓంకార్ సాల్వి, కెప్టెన్ అజింక్యా రహానేలతో కూడిన ముంబై సెలక్షన్ కమిటీ.. పృథ్వీ షా అధిక బరువుతో ఉన్నాడని గుర్తించింది. నెట్ సెషన్స్‌ను సైతం పృథ్వీ నిర్లక్ష్యం చేస్తున్నాడని టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి సెలక్టర్లకు ఫిర్యాదు అందిందట. ఈ క్రమంలోనే అతడికి గుణపాఠం చెప్పాలని భావించి.. జట్టు నుంచి తప్పించినట్లు తెలిపింది.
గత కొంతకాలంగా ఫృథ్వీ షా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన రెండు రంజీ మ్యాచుల్లో బరోడా పై 7,12 మహారాష్ట్ర పై 1, 39* పరుగులు చేశాడు.
Sarfaraz Khan : కివీస్‌తో తొలి టెస్టులో భారీ సెంచరీ.. సర్ఫరాజ్ ఖాన్‌కు ప్రమోషన్..