×
Ad

Prithvi Shaw : వార్నీ.. నువ్వు మారవా బ్రో.. మైదానంలో పృథ్వీషా రచ్చరచ్చ.. సహచరుడిపై బ్యాటుతో దాడికి యత్నం.. వీడియో వైరల్..

Prithvi Shaw : మ్యాచ్‌లో సెంచరీ చేసిన పృథ్వీషా.. ఆ తరువాత మరో వివాదంలో చిక్కుకున్నాడు. సహచర ప్లేయర్‌పై బ్యాటుతో దాడికి యత్నించాడు.

Prithvi Shaw

Prithvi Shaw : టీమిండియాకు దూరమైన బ్యాటర్ పృథ్వీషా ఇప్పుడిప్పుడే గాడినపడుతున్నాడు. గత కొన్నేళ్లుగా పేలవ ఫామ్, ఫిట్‌నెస్‌తో అనేక విమర్శలు ఎదుర్కొన్న పృథ్వీషా .. పలు వివాదాస్పద విషయాల్లోనూ తలదూర్చి క్రమశిక్షణారాహిత్యం వంటి ఆరోపణలతో టీమిండియా జట్టు నుంచి బయటకొచ్చాడు. ప్రస్తుతం పలు దేశవాళీ టోర్నీల్లో ఆడుతూ మళ్లీ తన సత్తాచాటుతున్నాడు. తాజాగా.. మ్యాచ్‌లో సెంచరీ చేసిన పృథ్వీషా.. ఆ తరువాత మరో వివాదంలో చిక్కుకున్నాడు. సహచర ప్లేయర్‌పై బ్యాటుతో దాడికి యత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు ముందు మాజీ జట్టు ముంబైతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో మహారాష్ట్ర తరపున ఆడిన పృథ్వీషా అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 140 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. చివరికి 181 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అర్షిన్‌తో కలిసి తొలి వికెట్‌కు 305 పరుగులు జోడించాడు. పృథ్వీ షా సెంచరీ చేసినప్పటికీ ముంబయి ఆటగాడు ముషీర్ ఖాన్ ను బ్యాటుతో కొట్టబోయి వివాదంలో చిక్కుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు మారవా బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Rohit Sharma : కెప్టెన్సీ తొలగింపు తర్వాత తొలిసారి రోహిత్ శర్మ ఎమోషనల్ స్పీచ్..! అంతా ద్రవిడ్ ప్రణాళికలే..

ముంబయి ఆటగాడు ముషీర్ ఖాన్ ను పృథ్వీ షా బ్యాటుతో కొట్టబోయాడు. పృథ్వీని ఔట్ చేసిన ముషీర్.. అతడికి వీడ్కోలు ఇచ్చాడు. దీంతో పృథ్వీషా ఆగ్రహంతో ఉగిపోయాడు. ముషీర్ పై బ్యాటుతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో మైదానంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అంపైర్లు జోక్యం చేసుకొని పృథ్వీషాను దూరంగా తీసుకెళ్లారు. అంపైర్లు జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారేది.

అయితే, ఈ ఘటనపై ముంబై గానీ, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఆటగాళ్ల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదంగానే ఈ వివాదాన్ని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే పృథ్వీ షా తీరుపై కొంత క్రికెట్ ఫ్యాన్సు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన తన ప్రవర్తన మార్చుకోవాలని సూచిస్తున్నారు. క్రికెట్లో టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు.. క్రమశిక్షణగా ఉండాలంటూ సూచిస్తున్నారు.