Pro Panja League 2023
Pro Panja League 2023 – Arm Wrestling: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్‌కు తిరుగులేదు. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. సోమవారం ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో బరోడా బాద్‌షాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-2తో ఘన విజయం సాధించింది.
Rohit Sharma : పాకిస్తాన్ బౌలర్లపై ప్రశ్న.. రోహిత్ శర్మ సమాధానం విన్న రితికా ఏం చేసిందంటే..?
కిరాక్ హైదరాబాద్‌కు ఇది వరుసగా నాలుగో గెలుపు. బరోడా బాద్‌షాస్‌పై ఏకపక్ష విజయం అందించిన ఆర్మ్ రెజ్లర్లను కిరాక్ హైదరాబాద్ ప్రాంఛైజీ యజమాని నెదురమల్లి గౌతం రెడ్డి, సీఈవో త్రినాథ్ రెడ్డి అభినందించారు. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్ ఏడు మ్యాచులు ఆడగా ఐదు విజయాలను నమోదు చేసి సెమీఫైనల్స్‌కు మరింత చేరువైంది. బుధవారం రోహతక్ రౌడీస్‌తో తలపడనుంది.
Pro Panja League 2023
Manoj Tiwary : తూచ్.. రిటైర్‌మెంట్ కావట్లే.. వెనక్కి తగ్గిన మనోజ్ తివారి..!
అండర్ కార్డ్ మ్యాచుల్లో మిశ్రమ ఫలితాలు సాధించినప్పటికీ మెయిన్ కార్డ్‌లో కిరాక్ హైదరాబాద్ దూకుడు చూపిస్తోంది. మెన్స్ 80 కేజీల విభాగంలో అస్కర్ అలీ 5-0తో సచిన్ గోయల్‌పై గెలుపొంది కిరాక్ హైదరాబాద్‌కు శుభారంభం అందించాడు. 90 కేజీల విభాగంలో సిద్దార్థ్ మలాకర్ అదరగొట్టాడు. బరోడా బాద్‌షాస్ ఆర్మ్ రెజ్లర్ రంజిత్ కెపై 10-0తో సిద్దార్థ్ సూపర్ షో కనబరిచాడు. చివరగా 70 కేజీల విభాగంలో స్టీవ్ థామస్ సైతం 5-0తో మెరవటంతో కిరాక్ హైదరాబాద్ ఏకపక్ష విజయం సాధించింది. అంతకుముందు జరిగిన అండర్ కార్డ్ మ్యాచుల్లో బరోడా బాద్‌షాస్ రెండు గెలవగా, ఖాజి అబ్దుల్ మజ్ కిరాక్ హైదరాబాద్‌కు ఏకైక విజయాన్ని అందించాడు. అండర్ కార్డ్‌లో రెండు పాయింట్లు సాధించిన బరోడా బాద్‌షాస్.. మెయిన్ కార్డ్‌లో పాయింట్ల ఖాతా తెరవకపోవడం గమనార్హం.
Pro Panja League 2023