Pro Panja League 2023 : కిరాక్ హైద‌రాబాద్ అద‌ర‌హో.. సెమీఫైన‌ల్‌లో అడుగుపెట్టిన తెలుగు జ‌ట్టు

ప్రొ పంజా లీగ్ (ఆర్మ్‌ రెజ్లింగ్‌) తొలి సీజ‌న్‌లో కిరాక్ హైద‌రాబాద్(Kiraak Hyderabad) టాప్ లేపింది. గ్రూప్ ద‌శ‌లో ప‌ది మ్యాచులు ఆడ‌గా ఎనిమిది మ్యాచుల్లో విజ‌యం సాధించింది.

Pro Panja League 2023

Pro Panja League 2023 – Arm Wrestling : ప్రొ పంజా లీగ్ (ఆర్మ్‌ రెజ్లింగ్‌) తొలి సీజ‌న్‌లో కిరాక్ హైద‌రాబాద్(Kiraak Hyderabad) టాప్ లేపింది. గ్రూప్ ద‌శ‌లో ప‌ది మ్యాచులు ఆడ‌గా ఎనిమిది మ్యాచుల్లో విజ‌యం సాధించింది. త‌ద్వారా 137 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచి సెమీఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో ముంబయి మజిల్‌(Mumbai Muscle)తో త‌ల‌ప‌డిన హైద‌రాబాద్ 13-9 తేడాతో విజ‌యం సాధించింది.

Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టుకి కోహ్లీ నిజంగానే కోట్లాది రూపాయలు తీసుకుంటున్నాడా? విరాట్ ఏమన్నాడు?

కాగా.. ఇది హైద‌రాబాద్‌కు ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా ఏడో విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ గెలుపుతో పాయింట్ల ప‌ట్టిక‌లో త‌న అగ్ర‌స్థానాన్ని మ‌రింత ప‌టిష్టం చేసుకున్న హైద‌రాబాద్ సెమీఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా ప్రాంఛైజీ యజమాని నెదురుమల్లి గౌతం రెడ్డి, సీఈవో త్రినాథ్‌ రెడ్డిలు ఆర్మ్ రెజ్ల‌ర్ల‌ను అభినందించారు.

కండబలం అద‌ర‌హో..

అండర్‌ కార్డ్‌లో కిరాక్‌ హైదరాబాద్‌ మరోసారి త‌న ఆధిప‌త్యాన్ని చూపించింది. మొద‌టి గేమ్‌లో అహ్మద్‌ ఫైజ 0-1తో నిరాశపరిచినా.. 60 కేజీల విభాగంలో షోయబ్ అక్తర్‌, మహిళల 65 కేజీల విభాగంలో మధుర కెఎన్‌ వరుసగా 1-0తో ప్రత్యర్థులను పిన్‌ డౌన్ చేయ‌డంతో 2-1 ఆధిక్యం సాధించింది కిరాక్ హైద‌రాబాద్‌.

Video Viral: ఇలాగే ముందుకు వెళ్లి లెఫ్ట్ తీసుకుంటే ఏమొస్తుంది?: కారు ఆపి అడిగిన ధోనీ

అయితే.. మెయిన్‌ కార్డ్‌లో ఆరంభంలో ముంబయి మజిల్ దూకుడు చూపించింది. మెన్స్‌ 90 కేజీల విభాగంలో సిద్దార్థ్‌ మలాకర్‌ను ముంబయి ఆర్మ్‌ రెజ్లర్‌ కైల్‌ కమింగ్‌ ఏడుసార్లు పిన్‌ డౌన్‌ చేసినా. ..చివర్లో పుంజుకున్న సిద్దార్థ్‌ మూడు పాయింట్లతో మెరిశాడు. ఆ తర్వాత 100 కేజీల విభాగం గేమ్‌లో జగదీశ్‌ మూడుసార్లు ప్రమోద్‌ ముఖిని పిన్‌ డౌన్‌ చేశాడు. ఓ గేమ్‌లో ప్రమోద్‌ పైచేయి సాధించాడు. అయినా జగదీశ్‌ 3-1తో పైచేయి సాధించాడు. చివరగా మెన్స్‌ 70 కేజీల విభాగంలో స్టార్‌ ఆర్మ్‌ రెజ్లర్‌ స్టీవ్‌ థామస్‌ మరోసారి మెప్పించాడు. వేగవంతమైన పిన్‌ డౌన్‌లతో అదరగొట్టాడు. 5-0తో కిరాక్‌ హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.

నేడు జరిగే ప్రొ పంజా లీగ్‌ సెమీఫైనల్లో రోహతక్‌ రౌడీస్‌తో కిరాక్‌ హైదరాబాద్‌ తలపడనుండగా.. కోచి కెడి’ఎస్‌తో ముంబయి మజిల్‌ పోటీపడనుంది. ఆదివారం ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

MS Dhoni: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ధోనీ బ్యాట్.. వేలంలో రికార్డు ధర.. ఆ డబ్బులు ఏం చేశారంటే?