MS Dhoni: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ధోనీ బ్యాట్.. వేలంలో రికార్డు ధర.. ఆ డబ్బులు ఏం చేశారంటే?

2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ సిక్స్ కొట్టిన బ్యాట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్యాట్‌కు వేలం నిర్వహించారు.

MS Dhoni: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ధోనీ బ్యాట్.. వేలంలో రికార్డు ధర.. ఆ డబ్బులు ఏం చేశారంటే?

MS Dhoni Bat Auction

MS Dhoni Bat Auction: టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీకి అభిమానుల సంఖ్య ఎక్కువే. ధోనీ క్రీజులో ఉన్నాడంటే ఎంత టెన్షన్ మ్యాచ్ అయినా విజయం భారత్ జట్టుకు మోకరిల్లాల్సిందే. చివరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా విజయంపై ప్రత్యర్థుల ఆశలను సిక్సర్లతో చల్లాచెదురు చేయటంలో ధోనీ దిట్ట. ఇదేకోవలో 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చేరుతుంది. ఆ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ నువాన్ కులశేఖర్ బౌలింగ్‌లో ధోనీ సిక్స్ కొట్టడం ప్రతి భారతీయ క్రికెట్ అభిమానికి ప్రత్యకమైనది.

MS Dhoni’s Daughter Ziva : ధోని కుమార్తె జీవా ఏ స్కూల్‌లో చదువుతుందంటే…ఆ స్కూలు ఫీజు తెలిస్తే షాక్ అవుతారు

2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ సిక్స్ కొట్టిన బ్యాట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్యాట్‌కు వేలం నిర్వహించారు. లండన్‌లోని ఓ చారిటీ ఈవెంట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్ ను వేలం వేశారు. ఈ వేలంలో బ్యాట్ ఏకంగా రూ.83లక్షలు పలికింది.  ఆర్కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ( ఇండియా) కంపెనీ  భారీ ధరకు 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ ఉపయోగించిన బ్యాట్ ను కొనుగోలు చేసింది.

MS Dhoni : దొంగచాటుగా ధోని వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్.. ఫ్యాన్స్ ఫైర్‌.. ఇలా చేయ‌డం ఏం బాలేదు

అయితే, బ్యాట్ ద్వారా వచ్చిన డబ్బును మహేందర్ సింగ్ ధోనీ సతీమణి సాక్షి ఆధ్వర్యంలో నడిచే సాక్షి ఫౌండేషన్‌ కోసం ఖర్చుచేయనుంది. మరోవైపు ఈ బ్యాట్ కు వేలంలో భారీ ధర పలకడంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాట్ గా నిలిచిపోయింది.