Pro Panja League : ముంబయి మజిల్‌ చిత్తు.. కిరాక్ హైద‌రాబాద్ ఘన విజయం

ప్రొ పంజా లీగ్‌ (ఆర్మ్‌ రెజ్లింగ్‌)లో కిరాక్‌ హైదరాబాద్ అద‌ర‌గొడుతోంది. గురువారం జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో ముంబయి మజిల్‌పై 17-11తో కిరాక్‌ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.

Pro Panja League

Pro Panja League – Kiraak Hyderabad: ప్రొ పంజా లీగ్‌ (ఆర్మ్‌ రెజ్లింగ్‌)లో కిరాక్‌ హైదరాబాద్ అద‌ర‌గొడుతోంది. గురువారం జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో ముంబయి మజిల్‌పై 17-11తో కిరాక్‌ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. హైద‌రాబాద్‌కు ఈ సీజ‌న్‌లో ఇది మూడో విజ‌యం. అండర్‌ కార్డ్‌లో 2-1తో ఆధిక్యం సాధించిన కిరాక్‌ హైదరాబాద్‌.. మెయిన్‌ కార్డ్‌లో తొలి రెండు మ్యాచుల్లో విజయాలతో అదరగొట్టింది. ముంబయి మజిల్‌పై విజయంలో కిరాక్ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్‌ మధుర కెఎన్‌ కీలక పాత్ర పోషించింది.

RCB : క‌ప్పులు గెలిపించే కోచ్ వ‌చ్చాడు.. ఆర్‌సీబీ రాత మారుస్తాడా..?

ముంబయి మజిల్‌తో అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లో కిరాక్ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లు మెప్పించారు. మెన్స్‌ 60 కేజీల విభాగంలో షోయబ్‌ అక్తర్‌ తొలుత నిరాశపరిచినా.. ఆ తర్వాతి రెండు మ్యాచుల్లో కిరాక్‌ హైదరాబాద్‌ విజయాలు నమోదు చేసింది. గౌతం కుమార్‌ 1-0తో షోయబ్ అక్తర్‌పై నెగ్గి ముంబయి మజిల్‌కు శుభారంభం చేసినా ఉపయోగం లేకపోయింది. మెన్స్‌ 70 కేజీల విభాగంలో షాహిల్‌ హుస్సేన్‌, మహిళల 65 కేజీల విభాగంలో మధుర కెఎన్‌ వరుసగా 1-0తో విజయాలు సాధించారు. అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లో కిరాక్‌ హైదరాబాద్‌ 2-1తో ఆధిక్యం సాధించింది.

Pro Panja LeaguePro Panja League: హైదరాబాద్‌కు మళ్లీ నిరాశే.. ఇక ఇంతేనా?

అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లో ఉత్సాహం.. మెయిన్‌ కార్డ్‌లోనూ కొనసాగింది. తొలుత మెన్స్‌ 90 కేజీల విభాగంలో కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్‌ సిద్దార్థ్‌ మలాకర్‌ అదరగొట్టాడు. ముంబయి మజిల్‌ ఆర్మ్‌ రెజ్లర్‌ అర్పన్‌కార్‌ను చిత్తు చేసి 10-0తో గెలుపొందాడు. దీంతో కిరాక్‌ హైదరాబాద్‌ 12-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. మహిళల 65 కేజీల విభాగంలో మధుర కెఎన్‌.. డబుల్‌ ధమాకా ప్రదర్శన చేసింది. అండర్‌ కార్డ్‌లో మోనికను మట్టికరిపించిన మధుర.. మెయిన్‌ కార్డ్‌లో ప్రియ వర్మను చిత్తు చేసింది. 5-0తో మధుర మెరువగా.. కిరాక్‌ హైదరాబాద్‌ 17-1తో తిరుగులేని పొజిషన్‌లో నిలిచింది. చివరగా స్పెషల్‌ కేటగిరీ మ్యాచ్‌లో భుట్టా సింగ్‌ నిరాశపరిచినా.. కిరాక్‌ హైదరాబాద్‌ విజయం అప్పటికే ఖాయమైంది. ముంబయి మజిల్‌కు ఆ జట్టు ఆర్మ్‌ రెజ్లర్‌ చందన్‌ కుమార్‌ బెహార 10-0తో ఊరట విజయం అందించింది.

Pro Panja League

IND vs WI : బ్యాటింగ్‌కు వెళ్లిన‌ చాహ‌ల్‌ను వెన‌క్కి పిలిచిన పాండ్య.. రూల్స్ ఒప్పుకోవ‌న్న అంపైర్లు.. ఆ మాత్రం తెలియ‌దా..!