Tokyo Olympics 2020: సెమీస్‌లో ఓడిపోయిన సింధు

కోట్ల మంది గుండెలు కోరుకున్న గెలుపు.. ఒలింపిక్స్‌లో సింధు విజయం కోసం భారతీయులంతా ఉత్కంఠగా ఎదురుచూడగా.. చివరకు వారి ఆశలు ఆవిరయ్యాయి.

Tokyo Olympics 2020: కోట్లమంది గుండెలు కోరుకున్న గెలుపు.. ఒలింపిక్స్‌లో సింధు విజయం కోసం భారతీయులంతా ఉత్కంఠగా ఎదురుచూడగా.. చివరకు వారి ఆశలు ఆవిరయ్యాయి. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో పీవీ సింధు-తైజుయింగ్‌ మధ్య పోరు జరిగింది. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌లో ప్రపంచ నెంబర్ వన్‌ తైజుయింగ్‌.. సింధుపై విజయం సాధించింది.

ఫస్ట్ సెట్‌లో సింధు హోరాహోరీ పోరులో 21-18తో కోల్పోయింది. సెమీస్‌లో భారీ అంచనాల మధ్య ఎంటర్ అయిన సింధు.. ఆరంభంలో దూకుడుగా ఆడినా.. తర్వాత పట్టు కోల్పోయింది. చివరకు ఫస్ట్ సెట్‌లో ఓడిపోయింది. రెండో సెట్‌లో మాత్రం సింధు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రెండో సెట్‌లో కూడా 21-12తో తైజుయింగ్‌ చేతిలో సింధూ ఓడిపోయింది.

రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించి విశ్వ యవనికపై భారత పతకాన్ని రెపరెపలాడించిన సింధు టోక్యోలోనూ సత్తా చాటుతుందని అందరూ భావించారు. చివరకు తైజు యింగ్‌ చేతిలో సింధు ఓడిపోగా.. గోల్డ్ ఆశ‌లు ఆవిర‌య్యాయి. అయితే బ్రాంజ్ మెడ‌ల్ కోసం ఆమె రేపు మ‌రో మ్యాచ్ ఆడనున్నారు.

2016లో రియో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ సాధించిన సింధు.. టోక్యోలో కాంస్య ప‌త‌కం దక్కించుకునే అవకాశం ఉంది. ఫస్ట్ గేమ్‌లో సింధు హోరాహోరీగా ఆడి.. తైజుయింగ్‌కు గ‌ట్టి పోటీనిచ్చింది. సెకండ్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది సింధు.19 నిమిషాల్లోనే గేమ్‌ను గెలిచి ఫైన‌ల్లో ప్ర‌వేశించింది తైజుయింగ్.

ట్రెండింగ్ వార్తలు