ప్రపంచంలో సింధూనే గొప్ప అనుకుందట, వర్కౌట్ వీడియో

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 07:25 AM IST
ప్రపంచంలో సింధూనే గొప్ప అనుకుందట, వర్కౌట్ వీడియో

Updated On : August 28, 2019 / 7:25 AM IST

వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌ షిప్ గెలవటం అంటే చిన్న విషయం కాదు. దాని కోసం చాలా కష్టపడాలి. మరి పీవీ సింధు ఎంత కష్టపడితే ఆ చాంపియన్ ఫిప్ ను గెలుచుకుని ఉంటుంది. కింద ఉన్న వీడియో చూస్తే మీకు అర్ధం అవుతోంది. సింధు ఫిట్‌నెస్ కోసం క‌స‌ర‌త్తులు చేసే వీడియో చూస్తే.. అంత‌ర్జాతీయ పోటీల్లో ప‌త‌కాలు సాధించాలంటే మ‌నోధైర్యం ఒక్క‌టే కాదు, ఫిట్‌నెస్ కూడా చాలా అవసరం అనే విషయం తెలుస్తోంది. 

ఆనంద్ మ‌హీంద్ర మంగళవారం (ఆగస్ట్ 27, 2019) త‌న ట్విట్ట‌ర్ లో సింధు ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ.. సింధు వ‌ర్కౌట్‌ వీడియో చూశాక.. భార‌త యువ క్రీడాకారులు అంతా ఆమెను ఆద‌ర్శంగా తీసుకుంటార‌ని, సింధు లాంటి ప‌ట్టుద‌ల అందరికీ అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో తెలిపారు.  

చాంపియన్ షిప్ గెలిచిన సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లడుతూ.. ఎప్పుడు జాతీయగీతం పాడినా ఓ గ్రేట్ ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ ఆదివారం బాసెల్ వేదికగా జాతీయగీతం విన్నప్పుడు మాత్రం ఈ ప్రపంచంలో నేనే టాప్ అనిపించింది. జాతీయ జెండా ఎగరడం చూస్తుంటే అద్భుతంగా అనిపించింది.